నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు.. | Stock Market Updates on October 3; Sensex down 180pts, Nifty below 24800 | Sakshi
Sakshi News home page

నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు..

Oct 3 2025 9:46 AM | Updated on Oct 3 2025 10:27 AM

Stock Market Updates on October 3; Sensex down 180pts, Nifty below 24800

మిశ్రమ ప్రపంచ సంకేతాల ప్రభావంతో భారత బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ 50 నష్టాల్లో కదులుతున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 299.17 పాయింట్ల నష్టంతో 80,684.14 వద్ద, అదేవిధంగా ఎన్ఎస్ఈ నిఫ్టీ 76.75 పాయింట్ల క్షీణతతో 24,759.55 వద్ద ప్రారంభమయ్యాయి.

బీఎస్ఈలో టాటా స్టీల్, టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంక్ టాప్ గెయినర్స్, ఎటర్నల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హిందుస్థాన్ యూనిలీవర్ టాప్ డ్రాగ్స్గా నిలిచాయి. ఎన్ఎస్ఈలో టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్, టాటా మోటార్స్ టాప్ గెయినర్స్ గా ఉండగా, మాక్స్ హెల్త్, ఐషర్ మోటార్స్, హెచ్ డీఎఫ్సీ బ్యాంక్ టాప్ లూజర్స్ గా నిలిచాయి.

మరోవైపు విస్తృత మార్కెట్లు పెరిగాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ 0.33 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్ 0.4 శాతం పెరిగాయి. నిఫ్టీ మెటల్, పీఎస్యూ బ్యాంక్, ఫార్మా వరుసగా 0.95 శాతం, 0.48 శాతం, ఫార్మా 0.34 శాతం లాభపడ్డాయి. ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ 0.45 శాతం నష్టపోయింది.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement