మైక్రోసాఫ్ట్ భారతదేశంలో 17.5 బిలియన్ డాలర్ల (సుమారు రూ.1.47 లక్షల కోట్లు) పెట్టుబడిని ప్రకటించిన తరువాత అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ, మైక్రోసాఫ్ట్ ఛైర్మన్, సీఈవో సత్య నాదెళ్ల సమావేశమయ్యారు. దీనికి సంబంధించిన ఓ ఫోటోను గౌతమ్ అదానీ తన ఎక్స్ (గతంలో ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేశారు. అది కాస్తా వైరల్‌గా మారింది.
ఈ చిత్రాన్ని పోస్ట్ చేస్తూ ఏఐ యుగంలో ఫిజికల్, డిజిటల్ అంశాలపై చర్చించినట్లు వెల్లడించారు. ‘సత్య నాదెళ్లను కలవడం, సాంకేతికత భవిష్యత్తుపై ఆయన అమూల్యమైన భావాలను పొందడం ఎప్పుడూ ఆనందకరం. ఏఐ యుగంలో ఫిజికల్, డిజిటల్ ప్రపంచాలు కలుస్తున్నందున మైక్రోసాఫ్ట్‌తో మా 360 డిగ్రీల భాగస్వామ్యాన్ని మరింత లోతుగా తీసుకెళ్తున్నందుకు సంతోషిస్తున్నాం’ అని అదానీ పేర్కొన్నారు. నాదెళ్ల స్వయంగా నిర్మిస్తున్న ఏఐ యాప్‌ల డెమోను చూడటం పట్ల ప్రశంసలు వ్యక్తం చేశారు.
భారత్ గ్లోబల్ టెక్ లీడర్‌గా..
అదానీ గ్రూప్ ఎనర్జీ, పోర్ట్‌లు వంటి భౌతిక మౌలిక సదుపాయాల సామర్థ్యాలు మైక్రోసాఫ్ట్ ఏఐ, క్లౌడ్ నైపుణ్యాలతో జతకట్టడం భారతదేశం సాంకేతిక లక్ష్యాలకు కీలకమౌతుంది. అదానీ-నాదెళ్ల భాగస్వామ్యం మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ల వృద్ధికి (అదానీకనెక్స్ జాయింట్ వెంచర్ ద్వారా ఇప్పటికే మహారాష్ట్ర, తెలంగాణలో సహకారం ఉంది) మరింత ఊతమిస్తుంది. భారత్‌లో గూగుల్, అమెజాన్ వంటి దిగ్గజాలు కూడా భారీగా పెట్టుబడులు ప్రకటించిన నేపథ్యంలో దేశ డేటా సెంటర్ మార్కెట్ వేగంగా విస్తరించనుంది. ఈ పరిణామం మేక్ ఇన్ ఇండియా, వికసిత్ భారత్ 2047 లక్ష్యాలను మరింత బలోపేతం చేస్తుంది.
Always a pleasure to meet @satyanadella and gain his valuable insights into the future of technology. We are excited to continue building a 360° partnership as the physical and digital worlds converge in the age of AI. Getting a demo from him of the AI apps he is personally… pic.twitter.com/T70YTbjTbT
— Gautam Adani (@gautam_adani) December 10, 2025
ఇదీ చదవండి: అసంఘటిత కార్మికులకు అండగా ఏఐ


