ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్-2025 రెండో సెమీ ఫైనల్‌లో భారత్- ఆస్ట్రేలియా (WC Ind vs Aus) తలపడుతున్నాయి. నవీ ముంబైలోని డాక్టర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా టాస్ గెలిచిన ఆసీస్ మహిళా జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుని.. హర్మన్ సేనను బౌలింగ్‌కు ఆహ్వానించింది.
టాస్ సందర్భంగా ఆసీస్ కెప్టెన్ అలిసా హేలీ మాట్లాడుతూ.. తాము పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతున్నట్లు తెలిపింది. కీలక మ్యాచ్‌లో తాము ఒక మార్పు చేశామని.. జార్జియా వారేహమ్ స్థానంలో సోఫీ మోలినెక్స్ జట్టులోకి వచ్చినట్లు వెల్లడించింది.
మరోవైపు.. భారత జట్టు సారథి హర్మన్‌ప్రీత్ కౌర్ మాట్లాడుతూ.. తమపై ఎలాంటి ఒత్తిడి లేదని.. ఫియర్‌లెస్‌గా ఆడతామని తెలిపింది. గాయం వల్ల దురదృష్టవశాత్తూ ప్రతికా రావల్ దూరమైందన్న హర్మన్.. హర్లిన్ డియోల్, ఉమా ఛెత్రిలకు విశ్రాంతినిచ్చామని.. రిచా ఘోష్, షఫాలీ వర్మ తుదిజట్టులోకి వచ్చారని పేర్కొంది.
టీమిండియా చెత్త రికార్డు
మహిళల వరల్డ్‌కప్ టోర్నీలో అత్యధిక సార్లు టాస్ ఓడిన జట్టుగా భారత్ నిలిచింది. గత పది వన్డేల్లో హర్మన్ ఒకే ఒక్కసారి టాస్ గెలవడం గమనార్హం.
మహిళల వరల్డ్‌కప్ టోర్నీ సింగిల్ ఎడిషన్‌లో అత్యధికసార్లు టాస్ ఓడిన జట్లు
👉ఇంగ్లండ్- 1982లో 13 మ్యాచ్‌లలో 9 సార్లు ఓటమి
👉భారత్- 1982లో 12 మ్యాచ్‌లలో 8 సార్లు ఓటమి
👉శ్రీలంక- 2000లో ఏడింట ఏడుసార్లు ఓటమి
👉సౌతాఫ్రికా- 2025లో ఎనిమిదింట ఏడుసార్లు ఓటమి
👉భారత్- 2025లో ఎనిమిదింట ఏడుసార్లు ఓటమి.
తుదిజట్లు
భారత్
షఫాలీ వర్మ, స్మృతి మంధాన, అమన్‌జోత్ కౌర్, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), దీప్తి శర్మ, రిచా ఘోష్(వికెట్ కీపర్), రాధా యాదవ్, క్రాంతి గౌడ్, శ్రీ చరణి, రేణుకా సింగ్ ఠాకూర్.
ఆస్ట్రేలియా
ఫోబ్ లిచ్‌ఫీల్డ్, అలిసా హేలీ (కెప్టెన్, వికెట్ కీపర్), ఎలీస్ పెర్రీ, బెత్ మూనీ, అన్నాబెల్ సదర్లాండ్, ఆష్లే గార్డ్‌నర్, తహ్లియా మెక్‌గ్రాత్, సోఫీ మోలినెక్స్, అలనా కింగ్, కిమ్ గార్త్, మేగన్ షట్.
చదవండి: IND vs AUS: అతడి కోసం అర్ష్‌దీప్‌ను బలిచేస్తారా?.. గంభీర్‌పై ఫైర్


