
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో (Women's Cricket World Cup 2025) భాగంగా విశాఖ వేదికగా ఆస్ట్రేలియాతో ఇవాళ (అక్టోబర్ 12) జరిగిన మ్యాచ్‌లో (India vs Australia) భారత్‌పై ఆస్ట్రేలియా మహిళలు 3 వికెట్ల తేడాతో గెలిచారు. నిర్ణీత 49 ఓవర్లలో 331 పరుగులు చేసి టీమిండియాపై ఆస్ట్రేలియా విజయం సాధించింది. మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత్‌కు వరుసగా ఇది రెండవ ఓటమి.
తొలుత టాస్ ఓడి ఆస్ట్రేలియా ఆహ్వానం మేరకు బ్యాటింగ్ చేసి 330 పరుగులు (48.5 ఓవర్లలో ఆలౌట్) చేసింది. ఓపెనర్లు స్మృతి మంధన (Smriti Mandhana), ప్రతిక రావల్ (Pratika Rawal) అద్భుతంగా ఆడారు. ముఖ్యంగా మంధన తన సహజ శైలిలో చెలరేగిపోయింది. 66 బంతుల్లోనే 9 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 80 పరుగులు చేసింది. మంధనతో పోలిస్తే ప్రతిక రావల్ కాస్త నిదానంగా ఆడింది. 96 బంతుల్లో 10 ఫోర్లు, సిక్సర్ సాయంతో 75 పరుగులు చేసింది.
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో అలీస్సా హీలీ: 142 పరుగులు (107 బంతుల్లో) చేసి తన అద్భుత ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను గెలిపించింది దాంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచింది.
ఈ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది, అయితే చివరి ఓవర్లలో ఆసీస్ విజయం సాధించింది. భారత్ మంచి స్కోరు చేసినా, హీలీ అద్భుత ప్రదర్శనతో మ్యాచ్‌ను ఆసీస్ చేతుల్లోకి తీసుకెళ్లింది.