
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో (Women's Cricket World Cup 2025) ఇవాళ (అక్టోబర్ 12) ఆసక్తికర సమరం జరుగుతుంది. భారత్, ఆస్ట్రేలియా (India vs Australia) జట్లు వైజాగ్ వేదికగా అమీతుమీ తేల్చుకుంటాయి. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా (Australia) టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. భారత మహిళల జట్టు (Team India) వన్డేల్లో టాస్ కోల్పోవడం ఇది వరుసగా ఆరోసారి.
తుది జట్లు..
ఆస్ట్రేలియా: అలిస్సా హీలీ (కెప్టెన్/వికెట్‌కీపర్), ఫోబ్ లిచ్‌ఫీల్డ్, ఎల్లీస్ పెర్రీ, బెత్ మూనీ, అన్నాబెల్ సదర్లాండ్, ఆష్లీ గార్డనర్, తహ్లియా మెక్‌గ్రాత్, సోఫీ మోలినెక్స్, కిమ్ గార్త్, అలానా కింగ్, మెగాన్ షుట్
భారత్: ప్రతికా రావల్, స్మృతి మంధాన, హర్లీన్ డియోల్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్‌కీపర్), అమంజోత్ కౌర్, స్నేహ్ రాణా, క్రాంతి గౌడ్, శ్రీ చరణి
కాగా, ప్రస్తుత ప్రపంచకప్‌లో భారత్ వరుసగా శ్రీలంక, పాకిస్తాన్‌పై విజయాలు సాధించి, మూడో మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతిలో అనూహ్యంగా ఓడింది. వాస్తవానికి ఆ మ్యాచ్‌లోనూ భారత్‌కు గెలిచే అవకాశం ఉండినప్పటికీ.. నదినే డి క్లెర్క్ సంచలన ఇన్నింగ్స్‌తో భారత్ చేతుల్లో నుంచి మ్యాచ్‌ను లాగేసుకుంది. ప్రస్తుతం భారత్ 3 మ్యాచ్‌ల్లో 2 విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది.
ఆసీస్ విషయానికొస్తే.. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన ఈ జట్టు తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై విజయం సాధించింది. ఆ తర్వాతి మ్యాచ్ (శ్రీలంక) వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోయింది (ఓ పాయింట్ లభించింది).
మూడో మ్యాచ్‌లో ఆసీస్ పాక్‌పై ఘన విజయం సాధించింది. ప్రస్తుతం ఆసీస్ 3 మ్యాచ్‌ల్లో 2 విజయాలతో 5 పాయింట్లు ఖాతాలో కలిగి ఉండి పట్టికలో రెండో స్థానంలో ఉంది. 3 మ్యాచ్‌ల్లో మూడు విజయాలు సాధించిన ఇంగ్లండ్ టాప్ ప్లేస్‌లో ఉంది.
చదవండి: చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా.. 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి జట్టు