మా బౌలర్లను మరి అంతలా కొట్టకు జైశ్వాల్‌: బ్రియన్‌ లారా | Yashasvi Jaiswal Shines with 175 in Delhi Test; Brian Lara’s Funny Reaction Delights Fans | IND vs WI 2025 | Sakshi
Sakshi News home page

మా బౌలర్లను మరి అంతలా కొట్టకు జైశ్వాల్‌: బ్రియన్‌ లారా

Oct 12 2025 12:16 PM | Updated on Oct 12 2025 12:29 PM

Brian Lara tells centurion Yashasvi Jaiswal dont beat WI bowlers that bad

ఢిల్లీ అరుణ్ జేట్లీ స్టేడియం వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఓపెనర్ యశస్వి జైశ్వాల్ అద్భుతమైన సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే.  ఓ దశలో సులువుగా డబుల్ సెంచరీ మార్క్‌ను అందుకునేలా కన్పించిన జైశ్వాల్‌.. అనుహ్యంగా 175 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రనౌట్ అయ్యి పెవిలియన్‌కు చేరాడు.

ఈ మ్యాచ్‌లో విండీస్ బౌలర్లను జైశూ ఉతికారేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఏకంగా 22 ఫోర్లు ఉన్నాయి. కాగా ప్రత్యక్షంగా ఈ మ్యాచ్‌ను వీక్షించిన వెస్టిండీస్‌ దిగ్గజాలు బ్రియన్ లారా, సర్ వివ్ రిచర్డ్స్ జైశ్వాల్ బ్యాటింగ్‌కు పిధా అయిపోయారు. రెండో రోజు ఆట అనంతరం జైశ్వాల్‌ను లారా కలిశాడు.

ఈ సందర్భంగా ఇద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. లారా జైస్వాల్‌ను అభినందిస్తూ.. "బౌలర్లను మరి అంతలా కొట్టకు జైశ్వాల్ ష‌ అంటూ సరదాగా అన్నాడు. దానికి జైస్వాల్ నవ్వుతూ "ట్రై చేస్తున్నా సర్!" అని సమాధానమిచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ఎక్స్‌లో షేర్ చేసింది.

కష్టాల్లో విండీస్‌..
కాగా ఈ మ్యాచ్‌లో కూడా విండీస్ పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. తొలుత బౌలర్లు తేలిపోగా.. ఇప్పుడు బ్యాటర్లు కూడా తీవ్ర నిరాశపరిచారు. విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 217 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టా‍ల్లో పడింది. విండీస్ ఫాల్ ఆన్ తప్పించుకోవాలంటే ఇంకా 102 పరుగులు చేయాలి.

చదవండి: IND vs WI: చరిత్ర సృష్టించిన టీమిండియా.. 65 ఏళ్లలో ఇదే తొలిసారి

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement