స్టార్ ప్లేయ‌ర్‌కు గాయం.. వీల్ చైర్‌పై గ్రౌండ్ బ‌య‌ట‌కు! వీడియో వైరల్‌ | Afghanistan’s Rahmat Shah Injured, Ruled Out of 3rd ODI vs Bangladesh | AFG vs BAN 2025 | Sakshi
Sakshi News home page

స్టార్ ప్లేయ‌ర్‌కు గాయం.. వీల్ చైర్‌పై గ్రౌండ్ బ‌య‌ట‌కు! వీడియో వైరల్‌

Oct 12 2025 1:51 PM | Updated on Oct 12 2025 3:36 PM

Setback for Afghanistan as key batter likely to miss series decider vs Bangladesh

బంగ్లాదేశ్‌తో మూడో వ‌న్డేకు అఫ్గానిస్తాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ రహమత్ షా కాలి పిక్క కండరాల గాయం కార‌ణంగా సిరీస్‌లోని ఆఖ‌రి వ‌న్డేకు దూరం కానున్న‌ట్లు తెలుస్తోంది. శ‌నివారం అబుదాబి వేదిక‌గా జ‌రిగిన రెండో వ‌న్డేలో రహ‌మ‌త్ షా కాలి పిక్క కండ‌రాలు ప‌ట్టేశాయి.

ఫిజియో వ‌చ్చి చికిత్స అందించిన‌ప్ప‌టికి ఫ‌లితం లేక‌పోయింది. దీంతో ఈ మిడిలార్డ‌ర్ బ్యాట‌ర్ రిటైర్ట్ హార్ట్‌గా వెనుదిరిగాడు. ఆ త‌ర్వాత చివరి వికెట్ పడిన తర్వాత జట్టుకు త‌న సేవ‌ల‌ను అందించాలనే ఉద్దేశ్యంతో రహ‌మ‌త్ నొప్పిని భరిస్తూనే తిరిగి బ్యాటింగ్‌కు వ‌చ్చాడు.

కానీ కేవలం ఒక బంతి మాత్రమే ఎదుర్కొన్న రహ‌మ‌త్‌.. క్రీజులో నిల‌బ‌డ‌లేక‌పోయాడు. దీంతో అఫ్గాన్ జట్టు ఫిజియో నిర్మలన్ థనబలసింగం వెంటనే మైదానంలోకి పరుగెత్తి వచ్చి మ‌ళ్లీ చికిత్స అందించాడు. కానీ నొప్పి ఎక్కువ‌గా ఉండ‌డంతో రహ్మత్‌ను వీల్‌చెయర్‌లో మైదానం బయటకు తీసుకెళ్లారు. ఇందుకు సంబంధిచిన వీడియోను అఫ్గాన్ క్రికెట్ ఎక్స్‌లో షేర్ చేసింది. కాగా అత‌డి గాయం తీవ్ర‌మైన‌దిగా తెలుస్తోంది

"దురదృష్టవశాత్తు ర‌హ‌మ‌త్ గాయ‌ప‌డ్డాడు. అత‌డిని రేపు(ఆదివారం) స్కానింగ్ తీసుకువెళ్తాము. రిపోర్ట్స్ బ‌ట్టి అప్‌డేట్ ఇస్తాము. ఏదేమైన‌ప్ప‌టికి అత‌డు కొంతకాలం ఆటకు దూరంగా ఉంటాడని నేను అనుకుంటున్నాను"అని థనబలసింగం మ్యాచ్ అనంత‌రం పేర్కొన్నాడు.

అత‌డు ఈ నెల‌లో జింబాబ్వేతో జ‌రిగే ఏకైక టెస్టుకు కూడా దూర‌మ‌య్యే అవ‌కాశాలు ఉన్నాయి. నిజంగా ఇది అఫ్గాన్ గ‌ట్టి ఎదురు దెబ్బే అనే చెప్పాలి. ప్ర‌స్తుతం అఫ్గాన్ జ‌ట్టులో  ర‌హ‌మ‌త్ కీల‌క ఆట‌గాడిగా కొన‌సాగుతున్నాడు. ఇటీవలే రహ్మత్ షా 4,000 వన్డే పరుగులు పూర్తి చేసిన తొలి అఫ్గాన్ బ్యాటర్‌గా నిలిచాడు. 

ఇక ఈ మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. బంగ్లాదేశ్‌పై  81 ప‌రుగుల తేడాతో అఫ్గానిస్తాన్ ఘ‌న విజ‌యం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలూండగానే అఫ్గాన్‌ సొంతం చేసుకుంది.
చదవండి: IND vs WI: చరిత్ర సృష్టించిన టీమిండియా.. 65 ఏళ్లలో ఇదే తొలిసారి



 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement