
న్యూజిలాండ్ వెటరన్ క్రికెటర్ సుజీ బేట్స్ (Suzie Bates) సరికొత్త చరిత్ర లిఖించింది. మహిళల క్రికెట్‌లో 350 మ్యాచ్‌ల క్లబ్‌లో చేరిన తొలి ప్లేయర్‌గా ప్రపంచ రికార్డు సాధించింది. ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్-2025 (ICC Womens World Cup)లో భాగంగా సౌతాఫ్రికాతో మ్యాచ్ సందర్భంగా సుజీ బేట్స్ ఈ ఫీట్ నమోదు చేసింది.
చేదు అనుభవం
అయితే, మహిళా క్రికెట్ చరిత్రలోనే అరుదైన ఘట్టానికి చేరువైన వేళ.. సుజీ బేట్స్‌కు ఓ చేదు అనుభవం మాత్రం తప్పలేదు. కాగా న్యూజిలాండ్ తరఫున 2006లో అరంగేట్రం చేసిన ఈ బ్యాటింగ్ ఆల్‌రౌండర్ ఇప్పటికీ జట్టులో ప్రధాన సభ్యురాలిగా కొనసాగుతుండటం విశేషం.
గోల్డెన్ డకౌట్
తన సుదీర్ఘ కెరీర్‌లో ఇప్పటి వరకు 172 వన్డేలు.. 177 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడింది సుజీ బేట్స్. సౌతాఫ్రికా మహిళలతో సోమవారం నాటి వరల్డ్‌కప్ మ్యాచ్ సందర్భంగా 173వ వన్డే ఆడిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఓవరాల్‌గా అంతర్జాతీయ స్థాయిలో 350 మ్యాచ్‌ల మైలురాయిని చేరుకుంది. అయితే, ఈ మ్యాచ్‌లో సుజీ బేట్స్ గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరగడం గమనార్హం.
Dream start for South Africa! 🔥
Marizanne Kapp makes an instant impact. Suzie Bates is gone!
Catch the LIVE action ➡ https://t.co/UaXsqrDnrA#CWC25 👉 NZ 🆚 SA | LIVE NOW on Star Sports & JioHotstar! pic.twitter.com/6cWC1BwnKh— Star Sports (@StarSportsIndia) October 6, 2025
న్యూజిలాండ్ తరఫున ఇన్నింగ్స్ ఆరంభించిన సుజీ.. సౌతాఫ్రికా పేసర్ మరిజానే కాప్ బౌలింగ్‌లో లెగ్ బిఫోర్ వికెట్‌గా పెవిలియన్ చేరింది. కాగా సుజీ బేట్స్ ఇప్పటి వరకు వైట్‌ఫెర్న్స్ తరఫున వన్డేల్లో మొత్తంగా 5896, టీ20లలో 4716 పరుగులు సాధించింది.
మరో విశేషం ఏమిటంటే..
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఇండోర్ వేదికగా సౌతాఫ్రికా వుమెన్ జట్టుతో మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ మహిళా టీమ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుని.. 25 ఓవర్ల ఆట ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 101 పరుగులు సాధించింది. ఇదిలా ఉంటే..న్యూజిలాండ్ కెప్టెన్ సోఫీ డివైన్‌కు ఇది 300వ అంతర్జాతీయ మ్యాచ్ కావడం మరో విశేషం.
మహిళల క్రికెట్‌లో అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన టాప్-5 ప్లేయర్లు వీరే
👉సుజీ బేట్స్ (న్యూజిలాండ్)- 350
👉హర్మన్‌ప్రీత్ కౌర్ (ఇండియా)- 342
👉ఎలిస్ పెర్రీ (ఆస్ట్రేలియా)- 341
👉మిథాలీ రాజ్ (ఇండియా)- 333
👉చార్లెట్ ఎడ్‌వర్డ్స్ (ఇంగ్లండ్)- 309.
చదవండి: ‘మీ నాన్నతో కలిసి ఆటో తోలుకో’;.. ధోని ఆరోజు చెప్పిన మాటతో ఇలా..: సిరాజ్