
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో ఇవాళ (అక్టోబర్ 13) బంగ్లాదేశ్, సౌతాఫ్రికా జట్లు మధ్య జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత ఓవర్లలో ఆ జట్టు 6 వికెట్ల నష్టానికి 232 పరుగులు మాత్రమే చేసింది.
అయితే సౌతాఫ్రికా నిర్ణీత 49.3 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. దాంతో బంగ్లాదేశ్‌పై సౌతాఫ్రికా 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. చివరి ఓవర్లలో చక్కటి బ్యాటింగ్‌తో విజయాన్ని సాధించింది. ఈ విజయంతో సౌతాఫ్రికా మహిళల జట్టు తమ విజయ పరంపరను కొనసాగించింది.
బంగ్లాదేశ్: శర్మిన్ అక్తర్ (50), షోర్నా అక్తర్ (51*), నిగార్ సుల్తానా (32)
సౌతాఫ్రికా: క్లో ట్రయాన్ (62), మారిజాన్ కాప్ (56), నాడిన్ డి క్లెర్క్ (37)