న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను ఆ దేశానికి అప్పగించాలన్న అక్కడి మధ్యంతర ప్రభుత్వ విజ్ఞప్తిని పరిశీలిస్తున్నట్టు విదేశాంగ శాఖ తెలిపింది. బంగ్లా ప్రజల ప్రయోజనాల పరిరక్షణకు, శాంతి, ప్రజాస్వామ్యం, స్థిరత్వాల సాధనకు భారత్ ఎప్పు డూ కట్టుబడి ఉందని విదేశాంగ శాఖ అధికార ప్రతిని« ది రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు.
బంగ్లాలో పరిస్థితు లను భారత్ నిశితంగా పరిశీలిస్తోందని చెప్పారు. 78 ఏళ్ల హసీనా గతేడాది బంగ్లాలో భారీ నిరసన జ్వాలల నేపథ్యంలో దేశం వీధి భారత్ కు పారిపోయి రావడం, అప్పటినుంచీ ఇక్కడే తలదాచు కుంటుండటం తెలిసిందే. మానవత్వంపైనే తీరని నేరాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ప్రత్యేక ట్రిబ్యునల్ ఆమెకు గత వారమే మరణ శిక్ష కూడా విధించింది.
పాక్‌వి సిగ్గుచేటు వ్యాఖ్యలు
అయోధ్య రామాలయ ధ్వజారోహణ కార్యక్రమం పాకిస్తాన్ ప్రభుత్వం చేసిన ప్రేలాపనలపై కేంద్రం మండిపడింది. మతోన్మాదం, మైనారిటీలపై అకృత్యాలకు పెట్టింది పేరైన పాక్ నుంచి నైతిక పాఠాలు నేర్చుకునే దుస్థితి భారత్‌కు పట్టలేదని జైస్వాల్ అన్నారు. బాబ్రీ మసీదు స్థలంపై ఆలయం కట్టడం, దానిపై ధ్వజారోహణ చేయడం ఏమిటంటూ పాకిస్తాన్ నోరు పారేసుకోవడం తెలిసిందే.


