PC: WPL
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో యూపీ వారియర్స్ జట్టుతో మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం ఘన విజయం సాధించింది. గ్రేస్ హారిస్ కేవలం 40 బంతుల్లో 85 పరుగులు, స్మృతి మంధాన 32 బంతుల్లో అజేయంగా 47 పరుగులు చేయడంతో ఆర్‌సీబీ యూపీ వారియర్స్ ను తొమ్మిది వికెట్ల తేడాతో ఓడించింది.
నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ కేవలం 12.1 ఓవర్లలో 144 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఇది డబ్ల్యూపీఎల్ చరిత్రలోనే రాయల్ ఛాలెంజర్స్‌కు వేగవంతమైన చేజ్. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్‌లో ఇది ఆర్‌సీబీ జట్టుకు రెండో విజయం.
అంతకుముందు టాస్ గెలిచిన ఆర్‌సీబీ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన వారియర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 143 పరుగులు మాత్రమే చేయగలింది.


