మహిళల ప్రీమియర్ లీగ్-2026లో హైవోల్టేజ్ మ్యాచ్‌కు రంగం సిద్దమైంది. ఈ టోర్నీలో భాగంగా నవీ ముంబై వేదికగా ముంబై ఇండియన్స్, యూపీ వారియర్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.
ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ అమ్మాయి నల్లా క్రాంతి రెడ్డి ముంబై ఇండియన్స్ తరపున అరంగేట్రం చేసింది. అదేవిధంగా స్టార్ పేసర్ ఇస్మాయిల్‌కు ముంబై విశ్రాంతి ఇచ్చింది. ఆమె స్ధానంలో హేలీ మాథ్యూస్ తుది జట్టులోకి వచ్చింది. యూపీ మాత్రం ఎటువంటి మార్పులు చేయలేదు.
కాగా యూపీ వారియర్స్ తమ చివరి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను 7 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఇప్పుడు అదే జోరును ఈ మ్యాచ్‌లో కూడా కొనసాగించాలని లానింగ్ సేన ఉవ్విళ్లూరుతోంది.
తుది జట్లు
యుపీ వారియర్జ్: కిరణ్ నవ్‌గిరే, మెగ్ లానింగ్ (కెప్టెన్), ఫోబ్ లిచ్‌ఫీల్డ్, హర్లీన్ డియోల్, శ్వేతా సెహ్రావత్ (వికెట్ కీపర్), క్లో ట్రయాన్, దీప్తి శర్మ, సోఫీ ఎక్లెస్టోన్, ఆశా శోభనా జాయ్, శిఖా పాండే, క్రాంతి గౌడ్
ముంబై ఇండియన్స్: హేలీ మాథ్యూస్, గుణాలన్ కమలిని(వికెట్ కీపర్), అమేలియా కెర్, నాట్ స్కివర్-బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), అమంజోత్ కౌర్, నికోలా కారీ, సజీవన్ సజన, సంస్కృతి గుప్తా, నల్లా క్రాంతి రెడ్డి, త్రివేణి వశిష్ట


