ఢిల్లీ తొలి గెలుపు | Delhi Capitals sealed their first victory of the Womens Premier League 2026 | Sakshi
Sakshi News home page

ఢిల్లీ తొలి గెలుపు

Jan 15 2026 6:23 AM | Updated on Jan 15 2026 6:23 AM

Delhi Capitals sealed their first victory of the Womens Premier League 2026

7 వికెట్ల తేడాతో యూపీ వారియర్స్‌ ఓటమి 

లిజెల్లీ లీ మెరుపులు

ముంబై: మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)లో ఢిల్లీ క్యాపిటల్స్‌ గెలుపు బోణీ కొట్టింది. బుధవారం యూపీ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఏడు వికెట్ల తేడాతో నెగ్గింది. మొదట యూపీ వారియర్స్‌ నిరీ్ణత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. కెపె్టన్‌ మెగ్‌లానింగ్‌ (38 బంతుల్లో 54; 9 ఫోర్లు, 1 సిక్స్‌) హాఫ్‌సెంచరీతో సత్తా చాటగా... హర్లీన్‌ డియోల్‌ (36 బంతుల్లో 47; 7 ఫోర్లు), లిచ్‌ఫీల్డ్‌ (20 బంతుల్లో 27; 5 ఫోర్లు) రాణించారు. ఢిల్లీ బౌలర్లలో షఫాలీ వర్మ, మరిజానే కాప్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. 

తెలుగమ్మాయి నల్లపురెడ్డి శ్రీచరణి, స్నేహ్‌ రాణా, నందిని శర్మ తలా ఒక వికెట్‌ తీశారు. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్‌ 20 ఓవర్లలో 3 వికెట్లకు 158 పరుగులు చేసింది. లిజెల్లీ లీ (44 బంతుల్లో 67; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) దంచికొట్టగా... ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ షఫాలీ వర్మ (32 బంతుల్లో 36; 6 ఫోర్లు) రాణించింది. వీరిద్దరూ తొలి వికెట్‌కు 11.3 ఓవర్లలో 93 పరుగులు జోడించి జట్టుకు గట్టి పునాది వేయగా... వోల్వార్ట్‌ (25 నాటౌట్‌; 2 ఫోర్లు, 1 సిక్స్‌), జెమీమా (21; 3 ఫోర్లు) మిగిలిన పని పూర్తిచేశారు. ఇన్నింగ్స్‌ చివరి బంతికి వోల్వార్ట్‌ ఫోర్‌ కొట్టి గెలిపించింది. నేడు జరిగే మ్యాచ్‌లో ముంబైతో  యూపీ వారియర్స్‌ ఆడుతుంది. 

స్కోరు వివరాలు 
యూపీ వారియర్స్‌ ఇన్నింగ్స్‌: కిరణ్‌ నవగిరె (సి) షఫాలీ (బి) కాప్‌ 0; లానింగ్‌ (సి) హెన్రీ (బి) నందిని 54; లిచ్‌ఫీల్డ్‌ (స్టంప్డ్‌) లిజెల్లి (బి)స్నేహ్‌ రాణా 27; హర్లీన్‌ (రిటైర్డ్‌ అవుట్‌) 47; శ్వేత (సి) శ్రీచరణి (బి) షఫాలీ 11; ట్రియాన్‌ (సి) నికీ (బి) శ్రీచరణి 1; ఎకిల్‌స్టోన్‌ (ఎల్బీ) (బి) కాప్‌ 3; శోభన (నాటౌట్‌) 1; దీప్తి (సి) స్నేహ్‌ రాణా (బి) షఫాలీ 2; శిఖా (నాటౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 154. 

వికెట్ల పతనం: 1–0, 2–47, 3–132, 4–141, 5–143, 6–148, 7–150, 8–152. 
బౌలింగ్‌: కాప్‌ 4–1–24–2; మిన్ను మణి 1–0–16–0; చినెల్లి 2–0–20–0; నందిని 3–0–29–1; స్నేహ్‌ రాణా 2–0–20–1; శ్రీచరణి 4–0–29–1; షఫాలీ 4–0–16–2. 

ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌: షఫాలీ (సి) దీప్తి (బి) శోభన 36; లిజెల్లీ (సి) కిరణ్‌ (బి) దీప్తి 67; వోల్వార్ట్‌ (నాటౌట్‌) 25; జెమీమా (సి) హర్లీన్‌ (బి) దీప్తి 21; కాప్‌ (నాటౌట్‌) 5; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 158. 
వికెట్ల పతనం: 1–94, 2–114, 3–148. 
బౌలింగ్‌: క్రాంతి 2–0–10–0; శిఖ 4–0–22–0; ఎకిల్‌స్టోన్‌ 4–0– 44–0; ట్రియాన్‌ 3–0–35–0; శోభన 4–0–20–1; దీప్తి 3–0–26–2.  
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement