మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)-2026లో భాగంగా నవీ ముంబై వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో యూపీవారియర్స్ బ్యాటర్లు మెరిశారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన యూపీ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. ముఖ్యంగా యూపీ కెప్టెన్ మెగ్ లానింగ్ విధ్వంసం సృష్టించింది.
ఈ ఆసీస్ లెజెండ్ ముంబై బౌలర్లను ఉతికారేసింది. కేవలం 45 బంతులు మాత్రమే ఎదుర్కొన్న లానింగ్ 11 ఫోర్లు, 2 సిక్స్‌లతో 70 పరుగులు చేసింది. ఆమెతో పాటు ఫీభీ లిచ్‌ఫీల్డ్ మెరుపులు మెరిపించింది. 37 బంతుల్లో7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 61 పరుగులు చేసింది. ఆఖరిలో హర్లీన్ డియోల్(25), ట్రయాన్(21) రాణించారు. ముంబై బౌలర్లలో అమీలియా కేర్ మూడు వికెట్లు పడగొట్టగా.. ట్ స్కివర్ బ్రంట్ రెండు, హీలీ మాథ్యూస్, అమన్‌జ్యోత్ కౌర్ తలా వికెట్ సాధించారు.
తుది జట్లు
యుపీ వారియర్జ్: కిరణ్ నవ్‌గిరే, మెగ్ లానింగ్ (కెప్టెన్), ఫోబ్ లిచ్‌ఫీల్డ్, హర్లీన్ డియోల్, శ్వేతా సెహ్రావత్ (వికెట్ కీపర్), క్లో ట్రయాన్, దీప్తి శర్మ, సోఫీ ఎక్లెస్టోన్, ఆశా శోభనా జాయ్, శిఖా పాండే, క్రాంతి గౌడ్
ముంబై ఇండియన్స్: హేలీ మాథ్యూస్, గుణాలన్ కమలిని(వికెట్ కీపర్), అమేలియా కెర్, నాట్ స్కివర్-బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), అమంజోత్ కౌర్, నికోలా కారీ, సజీవన్ సజన, సంస్కృతి గుప్తా, నల్లా క్రాంతి రెడ్డి, త్రివేణి వశిష్ట


