బెంగళూరు జైత్రయాత్ర
8 వికెట్లతో ఢిల్లీపై జయభేరి
రాణించిన బెల్, వోల్
నవీ ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అజేయంగా దూసుకెళుతోంది. జోరు మీదున్న జట్టు వరుసగా నాలుగో విజయాన్ని సాధించింది. శనివారం జరిగిన పోరులో బెంగళూరు 8 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై గెలిచింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిరీ్ణత 20 ఓవర్లలో 166 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ షఫాలీ వర్మ (41 బంతుల్లో 62; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) చెలరేగింది.
10 పరుగులకే జట్టు 4 వికెట్లు కోల్పోయిన దశలో లూసీ హామిల్టన్ (19 బంతుల్లో 36; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), స్నేహ్ రాణా (22; 3 ఫోర్లు)లతో కలిసి క్యాపిటల్స్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టింది. బెల్, సయాలీ చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన బెంగళూరు 18.2 ఓవర్లలో 2 వికెట్లకు 169 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ స్మృతి మంధాన (61 బంతుల్లో 96; 13 ఫోర్లు, 3 సిక్స్‌లు) దంచేసింది. త్రుటిలో సెంచరీ అవకాశాన్ని చేజార్చుకున్న ఆమె... జార్జియా వోల్ (42 బంతుల్లో 54 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు)తో కలిసి రెండో వికెట్‌కు 142 పరుగుల్ని జోడించింది.
స్కోరు వివరాలు
ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: షఫాలీ (సి) రావత్ (బి) బెల్ 62; లిజెల్లీ (బి) బెల్ 4; వోల్వార్ట్ (బి) బెల్ 0; జెమీమా (బి) సయాలీ 4; మరిజాన్ (బి) సయాలీ 0; నికీ (ఎల్బీ) (బి) రావత్ 12; మిన్ను మణి (సి) మంధాన (బి) డిక్లెర్క్ 5; స్నేహ్ రాణా (బి) రావత్ 22; హామిల్టన్ (సి) రాధ (బి) సయాలీ 36; శ్రీచరణి నాటౌట్ 11; నందిని రనౌట్ 1; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో ఆలౌట్) 166.
వికెట్ల పతనం: 1–5, 2–5, 3–10, 4–10, 5–69, 6–74, 7–108, 8–130, 9–164, 10–166.
బౌలింగ్: బెల్ 4–0–26–3, సయాలీ 3–0–27–3, శ్రేయాంక 3–0–44–0, డిక్లెర్క్ 4–0–31–1, ప్రేమ రావత్ 3–0–16–2, రాధా యాదవ్ 3–0–21–0.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: గ్రేస్ హారిస్ (సి) షఫాలీ (బి) మరిజాన్ 1; స్మృతి (సి) హామిల్టన్ (బి) నందిని 96; జార్జియా వోల్ నాటౌట్ 54; రిచా ఘోష్ నాటౌట్ 7; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (18.2 ఓవర్లలో 2 వికెట్లకు) 169.
వికెట్ల పతనం: 1–14, 2–156.
బౌలింగ్: మరిజాన్ కాప్ 4–0–21–1, లూసీ హామిల్టన్ 3.2–0–37–0, నందిని శర్మ 4–0–34–1, శ్రీచరణి 3–0–26–0, స్నేహ్ రాణా 1–0–13–0, షఫాలీ 1–0–14–0, మిన్ను మణి 2–0–20–0.


