డబ్ల్యూపీఎల్-2026లో భాగంగా నవీ ముంబై వేదికగా జరగుతున్న రెండో మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్స్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన యూపీ కెప్టెన్ మెగ్ లానింగ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. లానింగ్ యూపీ తరపున ఇదే తొలి మ్యాచ్ కావడం గమనార్హం. ఇంతకుముందు ఢిల్లీ క్యాపిటల్స్‌కు లానింగ్ సారథ్యం వహించింది.
కానీ డబ్ల్యూపీఎల్-2026 వేలానికి ముందు ఢిల్లీ ఆమెను విడిచిపెట్టింది. దీంతో వేలంలోకి వచ్చిన లానింగ్‌ను యూపీ వారియర్స్ సొంతం చేసుకుని తమ జట్టు బాధ్యతలు అప్పగించింది. ఇక ఈ మ్యాచ్‌లో స్టార్ ప్లేయర్లు సోఫీ డివైన్, జార్జియా వేర్‌హామ్ గుజరాత్ జెయింట్స్ తరపున అరంగేట్రం చేశారు. వీరిద్దరూ గత సీజన్ వరకు ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహించారు. వీరితో పాటు అనుష్క శర్మ కూడా గుజరాత్ తరపున డెబ్యూ చేసింది.
తుది జట్లు
గుజరాత్ జెయింట్స్: బెత్ మూనీ (వికెట్ కీపర్), సోఫీ డివైన్, ఆష్లీ గార్డనర్ (కెప్టెన్), జార్జియా వేర్‌హామ్, అనుష్క శర్మ, కనికా అహుజా, భారతీ ఫుల్మాలి, కష్వీ గౌతమ్, తనూజా కన్వర్, రాజేశ్వరి గయక్వాడ్, రేణుకా సింగ్ ఠాకూర్
యుపీ వారియర్జ్: మెగ్ లానింగ్ (కెప్టెన్), ఫోబ్ లిచ్‌ఫీల్డ్, హర్లీన్ డియోల్, డియాండ్రా డాటిన్, కిరణ్ ప్రభు నవ్‌గిరే, దీప్తి శర్మ, శ్వేతా సెహ్రావత్ (వికెట్ కీపర్), సోఫీ ఎక్లెస్టోన్, ఆశా శోబన, క్రాంతి గౌడ్, శిఖా పాండే


