మహిళల ప్రీమియర్ లీగ్ 2026లో ఆర్సీబీ తమ జోరును కొనసాగిస్తుంది. ఈ ఎడిషన్‌లో ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో విజయాలు నమోదు చేసిన ఆ జట్టు.. ఇవాళ (జనవరి 19) గుజరాత్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లోనూ చేసి భారీ స్కోర్ చేసింది.
టాస్ ఓడి ప్రత్యర్థి ఆహ్వానం మేరకు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ 9 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో బరిలోకి దిగిన గౌతమి నాయక్ ఊహించని రీతిలో చెలరేగింది. 55 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్ సాయంతో 73 పరుగులు చేసింది. స్టార్ ప్లేయర్ మంధనతో (26) కలిసి మూడో వికెట్‌కు 60 పరుగులు జోడించింది.
అనంతరం రిచా ఘోష్‌తో (27) కలిసి నాలుగో వికెట్‌కు 69 పరుగులు జోడించింది. గౌతమి నాయక్ ఔటయ్యాక ఆఖర్లో రాధా యాదవ్ (17), శ్రేయాంక పాటిల్ (8) బ్యాట్ ఝులిపించడంతో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో గ్రేస్ హ్యారిస్, జార్జియా వాల్ తలో పరుగు చేసి ఔట్ కాగా.. డి క్లెర్క్ (4), శ్రేయాంక (8) అజేయంగా నిలిచారు.
గుజరాత్ బౌలర్లలో కశ్వీ గౌతమ్, కెప్టెన్ ఆష్లే గార్డ్‌నర్ తలో 2 వికెట్లు తీయగా.. రేణుకా సింగ్ ఠాకూర్, సోఫి డివైన్ చెరో వికెట్ తీశారు. కాగా, ఈ ఎడిషన్‌లో ఆర్సీబీ వరుసగా డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, యూపీ వారియర్జ్, గుజరాత్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
ఎవరీ గౌతమి నాయక్..?
మహారాష్ట్రకు చెందిన 27 ఏళ్ల గౌతమి నాయక్‌ను ఆర్సీబీ ఈ సీజన్ వేలంలో రూ. 10 లక్షలకు సొంతం చేసుకుంది. కుడి చేతి వాటం స్పిన్ బౌలింగ్ (ఆఫ్) ఆల్‌రౌండర్ అయిన ఈమెకు దేశవాలీ క్రికెట్‌లో హార్డ్ హిట్టర్‌గా పేరుంది. గౌతమి బరోడా, మహారాష్ట్ర జట్లకు ప్రాతినిథ్యం వహించింది. మహారాష్ట్ర ప్రీమియర్ లీగ్‌లో రత్నగిరి జెట్స్ తరఫున సత్తా చాటి ఆర్సీబీని ఆకర్శించింది.


