జెమీమా, శ్రీచరణి
మళ్లీ ఓడిన ముంబై ఇండియన్స్
నాట్ సీవర్ మెరుపులు వృథా
వడోదర: జెమీమా రోడ్రిగ్స్ (37 బంతుల్లో 51 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) కెప్టేన్ ఇన్నింగ్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్‌ను గెలిపించింది. దీంతో మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ఢిల్లీ ఖాతాలో రెండో విజయం చేరింది. మంగళవారం జరిగిన పోరులో ఢిల్లీ 7 వికెట్ల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణిత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. నాట్ సీవర్ బ్రంట్ (45 బంతుల్లో 65 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెప్టేన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (33 బంతుల్లో 41; 7 ఫోర్లు) రాణించారు.
21 పరుగుల వద్దే ఓపెనర్లు సజన (9), హేలీ మాథ్యూస్ (12) నిష్క్రమించగా... హర్మన్, బ్రంట్ మూడో వికెట్‌కు 78 పరుగులు జోడించారు. క్యాపిటల్స్ బౌలర్లలో తెలుగమ్మాయి నల్లపురెడ్డి శ్రీచరణి 3 వికెట్లు పడగొట్టింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 19 ఓవర్లలో మూడే వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు లీజెల్లి లీ (28 బంతుల్లో 46; 7 ఫోర్లు, 1 సిక్స్), షఫాలీ వర్మ (29; 6 ఫోర్లు) తొలి వికెట్‌కు 63 పరుగులతో చక్కని ఆరంభమిచ్చారు. ముంబైకిది ‘హ్యాట్రిక్’ పరాజయం. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 6 మ్యాచ్‌లాడిన హర్మన్ బృందం కేవలం రెండు మ్యాచ్‌ల్లోనే గెలిచింది. డబ్ల్యూపీఎల్‌లో నేడు విశ్రాంతి దినం. గురువారం జరిగే మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్‌తో యూపీ వారియర్స్ తలపడుతుంది.
స్కోరు వివరాలు
ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: సజన (బి) నందిని 9; హేలీ మాథ్యూస్ (బి) మరిజాన్ కాప్ 12; నాట్ సీవర్ (నాటౌట్) 65; హర్మన్‌ప్రీత్ (సి) హామిల్టన్ (బి) శ్రీచరణి 41; నికోలా కేరీ (సి) స్నేహ్ రాణా (బి) శ్రీచరణి 12; అమన్‌జోత్ (సి) లీజెల్లి (బి) శ్రీచరణి 3; సంస్కృతి (నాటౌట్) 10; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (20
ఓవర్లలో 5 వికెట్లకు) 154. వికెట్ల పతనం: 1–21, 2–21, 3–99, 4–130, 5–134.
బౌలింగ్: మరిజాన్ 4–0–8–1, హామిల్టన్ 4–0– 36–0, నందిని శర్మ 4–0–36–1, శ్రీచరణి 4–0– 33–3, స్నేహ్ రాణా 3–0–27–0, షఫాలీ వర్మ 1–0–14–0
ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: షఫాలీ (బి) వైష్ణవి 29; లీజెల్లి లీ (స్టంప్డ్) రహిలా (బి) అమన్‌జోత్ 46; వోల్వార్డ్ (రనౌట్) 17; జెమీమా (నాటౌట్) 51; మరిజాన్ కాప్ (నాటౌట్) 10; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (19 ఓవర్లలో 3 వికెట్లకు) 155. వికెట్ల పతనం: 1–63, 2–84, 3–118.
బౌలింగ్: షబి్నమ్ 4–0–26–0, నికోలా 1–0–13–0, నాట్ సీవర్ 4–0–42–0, సంస్కృతి 1–0–13–0, అమన్‌జోత్ 3–0–21–1, వైష్ణవి 4–0–20–1, హేలీ 2–0–19–0.


