బెంగళూరు గెలిస్తే నేరుగా ఫైనల్‌కు... నేడు ముంబై ఇండియన్స్‌తో ‘ఢీ’ | Royal Challengers Bangalore will face Mumbai Indians today | Sakshi
Sakshi News home page

బెంగళూరు గెలిస్తే నేరుగా ఫైనల్‌కు... నేడు ముంబై ఇండియన్స్‌తో ‘ఢీ’

Jan 26 2026 2:53 AM | Updated on Jan 26 2026 2:53 AM

Royal Challengers Bangalore will face Mumbai Indians today

వడోదర: మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) వరుస విజయాలకు బ్రేక్‌ పడినప్పటికీ నేరుగా ఫైనల్‌ చేరే అవకాశాలైతే బోలెడున్నాయి. ఇప్పటికే పాయింట్ల పట్టికలో 5 విజయాలతో అగ్రస్థానంలో ఉన్న ఆర్‌సీబీ జట్టు... డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌తో నేడు జరిగే మ్యాచ్‌లో గెలిస్తే ఎంచక్కా టైటిల్‌ పోరుకే అర్హత సాధిస్తుంది. 

ఐదు జట్ల మధ్య జరుగుతున్న ఈ లీగ్‌లో పాయింట్ల పట్టికలో ‘టాప్‌’లో నిలిచిన జట్టు నేరుగా ఫైనల్‌ చేరుకుంటుంది. మరోవైపు ముంబై ఇండియన్స్‌ నిలకడలేని ప్రదర్శనతో అగచాట్లు పడుతోంది. ఈ మ్యాచ్‌ ఆర్‌సీబీ కంటే ముంబైకే కీలకం కానుంది. ఇది కూడా ఓడితే ఓ రకంగా ప్లేఆఫ్స్‌ అవకాశాల్ని సంక్లిష్టం చేసుకుంటుంది. 

ఈ నేపథ్యంలో హర్మన్‌ప్రీత్‌ బృందం స్మృతి మంధాన సారథ్యంలోని బెంగళూరుకు వరుసగా మరో పరాజయాన్ని రుచి చూపించేందుకు బరిలోకి దిగుతోంది.రాత్రి 7.30 గంటలకు మొదలయ్యే ఈ మ్యాచ్‌ స్టార్‌ స్పోర్ట్స్‌ నెట్‌వర్క్, జియో హాట్‌స్టార్‌ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement