మహిళల ఐపీఎల్ 2026 (WPL) ప్రారంభానికి ముందు యూపీ వారియర్జ్ సంచలన నిర్ణయం తీసుకుంది. తమ ఫ్రాంచైజీ నూతన కెప్టెన్‌గా ఆసీస్ దిగ్గజం మెగ్ లాన్నింగ్‌ను నియమించింది. ఈ విషయాన్ని వారియర్జ్ యాజమాన్యం సోషల్‌మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది.
33 ఏళ్ల లాన్నింగ్‌ను వారియర్జ్ ఈ సీజన్ వేలంలో రూ. 1.9 కోట్లకు కొనుగోలు చేసింది. లాన్నింగ్ నియామకంతో గత సీజన్ వరకు కెప్టెన్‌గా వ్యవహంచిన దీప్తి శర్మపై వేటు పడింది. రానున్న సీజన్‌లో దీప్తి సాధారణ ప్లేయర్‌గా కొనసాగుతుంది. దీప్తిని ఈ సీజన్ వేలంలో వారియర్జ్ యాజమాన్యం రూ. 3.2 కోట్లు వెచ్చించి, తిరిగి సొంతం చేసుకుంది.
లాన్నింగ్‌కు కెప్టెన్‌గా ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. ఆమె సారథ్యంలో ఆసీస్ ఓ వన్డే ప్రపంచకప్, 4 టీ20 ప్రపంచకప్‌లు గెలిచింది. డబ్ల్యూపీఎల్ కెప్టెన్‌గానూ లాన్నింగ్‌కు మంచి ట్రాక్ రికార్డే ఉంది. ఈమె నేతృత్వంలో ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా మూడు ఎడిషన్లలో ఫైనల్‌కు చేరింది. లాన్నింగ్‌ను డీసీ యాజమాన్యం ఇటీవలే విడుదల చేసింది.
లాన్నింగ్ సారథ్యంలో వారియర్జ్ పరిస్థితిలో మార్పు వస్తుందేమో చూడాలి. ఈ ఫ్రాంచైజీ డబ్ల్యూపీఎల్ చరిత్రలో అత్యంత పేలవమైన ట్రాక్ రికార్డు ఉన్న జట్టుగా ఉంది. తొలి ఎడిషన్‌లో (2023) ఐదింటి మూడో స్థానంలో నిలిచిన ఈ జట్టు.. సీజన్ సీజన్‌కు మరింత దిగజారుతూ నాలుగు (2024), ఐదు (2025) స్థానాలకు పడిపోయింది.
కాగా, డబ్ల్యూపీఎల్ 2026 జనవరి 9 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. సీజన్ ఓపెనర్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, ఆర్సీబీ తలపడనున్నాయి. వారియర్జ్ తమ తొలి మ్యాచ్‌ను జనవరి 10న (గుజరాత్ జెయింట్స్‌తో) ఆడనుంది.


