సోఫీ డివైన్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శన | Gujarat Giants win against UP Warriorz | Sakshi
Sakshi News home page

సోఫీ డివైన్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శన

Jan 23 2026 3:28 AM | Updated on Jan 23 2026 3:28 AM

Gujarat Giants win against UP Warriorz

యూపీ వారియర్స్‌పై గుజరాత్‌ జెయింట్స్‌ గెలుపు  

వడోదర: ఉమెన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)లో వరుసగా మూడు పరాజయాల తర్వాత గుజరాత్‌ జెయింట్స్‌ మళ్లీ గెలుపు బాట పట్టింది. ఆరు మ్యాచ్‌ల తర్వాత మూడో విజయంతో ఆ జట్టు ప్రస్తుతం రెండో స్థానానికి చేరింది. గురువారం జరిగిన పోరులో గుజరాత్‌ 45 పరుగుల తేడాతో యూపీ వారియర్స్‌ను ఓడించింది. 

టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. సోఫీ డివైన్‌ (42 బంతుల్లో 50 నాటౌట్‌; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీ నమోదు చేసింది. అనంతరం యూపీ 17.3 ఓవర్లలో 108 పరుగులకే కుప్పకూలింది.

రాజేశ్వరి (3/16) ప్రత్యర్థిని పడగొట్టగా ... సోఫీ డివైన్, రేణుకా సింగ్‌ చెరో 2 వికెట్లు తీశారు. నేడు డబ్ల్యూపీఎల్‌ మ్యాచ్‌లకు విరామం. శనివారం జరిగే పోరులో ఢిల్లీ క్యాపిటల్స్‌తో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు తలపడుతుంది.

స్కోరు వివరాలు 
గుజరాత్‌ జెయింట్స్‌ ఇన్నింగ్స్‌: మూనీ (సి) నవ్‌గిరే (బి) ఎకెల్‌స్టోన్‌ 38; డానీ వ్యాట్‌ (బి) క్రాంతి 14; అనుష్క (సి) శ్వేత (బి) క్రాంతి 14; గార్డ్‌నర్‌ (బి) దీప్తి 5; సోఫీ డివైన్‌ (నాటౌట్‌) 50; భారతి (రనౌట్‌) 5; కనిక (సి) నవ్‌గిరే (బి) ట్రయాన్‌ 6; కాశ్వీ (బి) ఎకెల్‌స్టోన్‌ 11; రేణుక (రనౌట్‌) 1; హ్యాపీ కుమారి (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 153. వికెట్ల పతనం: 1–23, 2–43, 3–65, 4–93, 5–105, 6–115, 7–131, 8–145. బౌలింగ్‌: క్రాంతి 4–0–18–2, శిఖ 4–0–53–0, దీప్తి 2–0–16–1, ఎకెల్‌స్టోన్‌ 4–0–22–2, ట్రయాన్‌ 4–0–32–1, శోభన 2–0–11–0. 

యూపీ వారియర్స్‌ ఇన్నింగ్స్‌: లానింగ్‌ (బి) కాశ్వీ 14; నవ్‌గిరే (స్టంప్డ్‌) మూనీ (బి) రేణుక 0; లిచ్‌ఫీల్డ్‌ (సి) రేణుక (బి) గార్డ్‌నర్‌ 32; హర్లీన్‌ (సి) గార్డ్‌నర్‌ (బి) రేణుక 3; ట్రయాన్‌ (నాటౌట్‌) 30; దీప్తి (ఎల్బీ) (బి) రాజేశ్వరి 4; శ్వేత (స్టంప్డ్‌) మూనీ (బి) రాజేశ్వరి 3; శోభన (సి) గార్డ్‌నర్‌ (బి) రాజేశ్వరి 7; ఎకెల్‌స్టోన్‌ (సి అండ్‌ బి) డివైన్‌ 1; శిఖ (రనౌట్‌) 1; క్రాంతి (బి) డివైన్‌ 1; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (17.3 ఓవర్లలో ఆలౌట్‌) 108. వికెట్ల పతనం: 1–2, 2–39, 3–57, 4–59, 5–67, 6–79, 7–93, 8–94, 9–97, 10–108. బౌలింగ్‌: రేణుక 4–0–20–2, కాశ్వీ 3–0–31–1, డివైన్‌ 3.3–0–16–2, గార్డ్‌నర్‌ 3–0–23–1, రాజేశ్వరి 4–0–16–3.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement