టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్‌కు టీమిండియా సిద్ధమైంది. సన్నాహకాల్లో భాగంగా బుధవారం సౌతాఫ్రికాతో వార్మప్ మ్యాచ్‌తో బరిలో దిగింది. ఈ మ్యాచ్‌లో సంజూ శాంసన్ స్థానంలో ఇషాన్ కిషన్ ఓపెనర్‌గా వచ్చాడు.
6, 6, 4, 6
విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మకు జోడీగా వచ్చిన ఇషాన్.. ధనాధన్ దంచికొట్టాడు. సిక్సర్ల వర్షం కురిపిస్తూ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ముఖ్యంగా ఐదో ఓవర్లో ప్రొటిస్ పేసర్ అన్రిచ్ నోర్జే రంగంలోకి దిగగా.. ఇషాన్ అతడి బౌలింగ్‌ను చితక్కొట్టాడు.
మూడు, నాలుగు బంతుల్లో సిక్సర్ బాదిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. ఐదో బంతిని బౌండరీకి తరలించాడు. ఆరో బంతిని మళ్లీ సిక్సర్‌గా మలిచాడు. అలా నాలుగు బంతుల్లోనే 22 పరుగులు పిండుకున్నాడు.
20 బంతుల్లోనే
ఈ క్రమంలో 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ (53) పూర్తి చేసుకున్నాడు ఇషాన్ కిషన్. సిక్సర్‌తో యాభై పరుగుల మార్కు దాటిన ఈ ఓపెనింగ్ బ్యాటర్ రిటైర్డ్ అవుట్‌గా వెనుదిరిగాడు. ఇషాన్ ఇన్నింగ్స్‌లో ఏడు సిక్స్‌లు, రెండు ఫోర్లు ఉన్నాయి.
కాగా టీ20 వరల్డ్‌కప్ వార్మప్ మ్యాచ్‌లో భాగంగా నవీ ముంబైలో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు అభిషేక్ శర్మ (18 బంతుల్లో 24), ఇషాన్ కిషన్ (20 బంతుల్లో 53) రిటైర్డ్ అవుట్‌గా నిష్క్రమించారు.
టీ20 వరల్డ్‌కప్-2026 జట్లు
భారత్
అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ,సంజు శాంసన్,హార్దిక్ పాండ్యా,రింకూ సింగ్,శివం దూబే,అక్షర్ పటేల్,అర్ష్‌దీప్ సింగ్,వరుణ్ చక్రవర్తి,జస్ప్రీత్ బుమ్రా,వాషింగ్టన్ సుందర్,హర్షిత్ రాణా,కుల్దీప్ యాదవ్.
సౌతాఫ్రికా
ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్),క్వింటన్ డి కాక్,ర్యాన్ రికెల్టన్ (వారం),డెవాల్డ్ బ్రెవిస్,ట్రిస్టన్ స్టబ్స్,జాసన్ స్మిత్,డేవిడ్ మిల్లర్,మార్కో యాన్సెన్,జార్జ్ లిండే,కార్బిన్ బాష్,కేశవ్ మహారాజ్,క్వేనా మఫాకా,లుంగీ ఎన్గిడి,అన్రిచ్ నోర్ట్జే,కగిసో రబడ.
చదవండి: WC 2026: వరల్డ్‌కప్ సెమీస్‌లో వైభవ్ సూర్యవంశీ విధ్వంసం
T20 WC IND vs USA: భారత తుదిజట్టు ఇదే.. ఇషాన్‌కు నో ఛాన్స్!
When you’re in form, everything goes your way!😮💨
ICC Men's #T20WorldCup | Warm-Up Match | 👉 #INDvSA | LIVE NOW ➡️ https://t.co/KpRezrTaFe pic.twitter.com/51Mr18qE1g— Star Sports (@StarSportsIndia) February 4, 2026


