తిరువనంతపురం వేదికగా ఐదో టీ20లో భారత్-న్యూజిలాండ్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ ఆఖరి పోరులో టీమిండియా మూడు మార్పులతో బరిలోకి దిగింది. గాయం నుంచి కోలుకున్న స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ తిరిగి జట్టులోకి వచ్చాడు.
అదేవిధంగా గత మ్యాచ్‌కు దూరంగా ఉన్న ఇషాన్ కిషన్, వరుణ్ చక్రవర్తిలు కూడా పునరాగమనం చేశారు. అయితే వరుసగా నాలుగు మ్యాచ్‌లలో విఫలమైన వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌కు మరోసారి టీమ్‌మెనెజ్‌మెంట్ అవకాశమిచ్చింది. తన సొంతమైదానంలో సంజూ సత్తాచాటాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరోవైపు కివీస్ ఏకంగా తమ జట్టులో నాలుగు మార్పులు చేసింది. లాకీ ఫెర్గూసన్, అలెన్, నీషమ్,జాకబ్స్ జట్టులోకి వచ్చారు.
తుది జట్లు
న్యూజిలాండ్: టిమ్ సీఫెర్ట్(వికెట్ కీపర్), ఫిన్ అలెన్, రాచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, బెవాన్ జాకబ్స్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), కైల్ జామిసన్, ఇష్ సోధి, లాకీ ఫెర్గూసన్, జాకబ్ డఫీ
భారత్: అభిషేక్ శర్మ, సంజు సామ్సన్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, శివం దుబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా


