breaking news
Axar patel
-
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. స్టార్ ప్లేయర్ రీఎంట్రీ
తిరువనంతపురం వేదికగా ఐదో టీ20లో భారత్-న్యూజిలాండ్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ ఆఖరి పోరులో టీమిండియా మూడు మార్పులతో బరిలోకి దిగింది. గాయం నుంచి కోలుకున్న స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ తిరిగి జట్టులోకి వచ్చాడు.అదేవిధంగా గత మ్యాచ్‌కు దూరంగా ఉన్న ఇషాన్ కిషన్, వరుణ్ చక్రవర్తిలు కూడా పునరాగమనం చేశారు. అయితే వరుసగా నాలుగు మ్యాచ్‌లలో విఫలమైన వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌కు మరోసారి టీమ్‌మెనెజ్‌మెంట్ అవకాశమిచ్చింది. తన సొంతమైదానంలో సంజూ సత్తాచాటాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరోవైపు కివీస్ ఏకంగా తమ జట్టులో నాలుగు మార్పులు చేసింది. లాకీ ఫెర్గూసన్, అలెన్, నీషమ్,జాకబ్స్ జట్టులోకి వచ్చారు.తుది జట్లున్యూజిలాండ్: టిమ్ సీఫెర్ట్(వికెట్ కీపర్), ఫిన్ అలెన్, రాచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, బెవాన్ జాకబ్స్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), కైల్ జామిసన్, ఇష్ సోధి, లాకీ ఫెర్గూసన్, జాకబ్ డఫీభారత్: అభిషేక్ శర్మ, సంజు సామ్సన్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, శివం దుబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా -
'రాహుల్, డుప్లెసిస్ కాదు.. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అతడే'
క్రికెట్ అభిమానులను అలరించేందుకు మరి కొద్ది రోజుల్లో ఐపీఎల్ పండగ రాబోతుంది. ఐపీఎల్-2025 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. తొలి మ్యాచ్‌లో కోల్‌కతా వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో మొత్తం 10 జట్లు తలపడనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయా ఫ్రాంచైజీ ఆటగాళ్ల రిటెన్షన్‌తో పాటు ఐపీఎల్ మెగా వేలంతో తమకు అవసరమైన ప్లేయర్లను కొనుగోలు చేశాయి. అయితే పది జట్లలో కేకేఆర్, ఢిల్లీ క్యాపిటల్స్ ప్రాంఛైజీలు ఇంకా తమ కెప్టెన్ల వివరాలను వెల్లడించలేదు.ఈ రెండు ఫ్రాంచైజీలు తమ జట్లకు కెప్టెన్లగా వ్యవహరించిన శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్‌ను వేలంలోకి విడిచిపెట్టాయి. దీంతో కొత్త కెప్టెన్ల ఎంపిక అనివార్యమైంది. కాగా ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ తమ జట్టు కెప్టెన్‌గా స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్(AxarPatel)ను నియమించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. జట్టులోఅనువజ్ఞుడైన కేఎల్ రాహుల్ ఉన్నప్పటికి ఢిల్లీ యాజమాన్యం అక్షర్ వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. తాజాగా ఇదే విషయంపై భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా తన అభిప్రాయాలను వెల్లడించాడు."ఢిల్లీ కెప్టెన్సీ రేసులో అక్షర్ పటేల్, రాహుల్, డుప్లెసిస్ ఉన్నారు. అయితే అక్షర్ పటేల్‌ను మాత్రం భారీ ధర(రూ. 16.50) వెచ్చించి మరి సొంతం చేసుకుంది. కెప్టెన్సీ రేసులో అక్షర్ అగ్రస్ధానంలో ఉన్నాడని అప్పుడే మనం ఆర్ధం చేసుకోవచ్చు. బాపు(అక్షర్) ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. భారత టీ20 జట్టు వైస్ కెప్టెన్‌గా కూడా బాధ్యతలు చేపట్టాడు. అతడు ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా ఆడనున్నాడు. భారత జట్టులో కీలక సభ్యునిగా కొనసాగుతున్నాడు.అతడు చాలా తెలివైనవాడు. ఆట స్థితిగతులను బాగా ఆర్ధం చేసుకున్నాడు. అక్షర్‌కు జట్టును నడిపించే అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. కాబట్టి అతడిని ఢిల్లీ తమ కెప్టెన్‌గా ఎంపిక చేసే ఛాన్స్ ఉందని" చోప్రా తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు.చదవండి: CT 2025: టీమిండియాకు భారీ షాక్.. స్టార్ ఓపెనర్‌కు గాయం -
ఆ 'బ్యాటింగ్ ఆర్డర్' సరైనది కాదు..
రాంచీ:న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో ప్రతీసారి విరాట్ కోహ్లి నుంచి టీమిండియా విజయాలు ఆశించడం తగదని మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు. విరాట్ మోస్తరుగా రాణించినా, ఎప్పుడూ అతనే విజయాల్ని అందించాలని భావించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించాడు. ప్రతీ మ్యాచ్‌లోనూ విరాట్ సాయాన్ని ఆశించడం అత్యాశే అవుతుందన్నాడు. 'న్యూజిలాండ్ తో సిరీస్‌లో భారత ప్రతీ విజయంలో విరాట్ పాత్ర ఉండాలని కోరుకోవడం తగదు. ఆ ఆటగాడే విజయాన్ని సాధించాలని అత్యాశను వదిలి సమష్టిగా పోరాడండి' అని గవాస్కర్ తెలిపాడు. మరోవైపు గత వన్డేలో అక్షర్ పటేల్ బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చడాన్ని గవాస్కర్ తప్పుబట్టాడు. స్పెషలిస్టు ఆటగాళ్లు మనీష్ పాండే, కేదర్ జాదవ్‌లను వెనక్కునెట్టి అక్షర్‌ను ఐదో స్థానంలో బ్యాటింగ్ కు తీసుకురావడం అంత మంచి ప్రయోగం కాదన్నాడు.


