ఆ 'బ్యాటింగ్ ఆర్డర్' సరైనది కాదు.. | clearly not amused at India's 'experiment' with the batting order, says sunil gavaskar | Sakshi
Sakshi News home page

ఆ 'బ్యాటింగ్ ఆర్డర్' సరైనది కాదు..

Oct 28 2016 4:10 PM | Updated on Sep 4 2017 6:35 PM

ఆ 'బ్యాటింగ్ ఆర్డర్' సరైనది కాదు..

ఆ 'బ్యాటింగ్ ఆర్డర్' సరైనది కాదు..

న్యూజిలాండ్తో జరుగుతున్న వన్డే సిరీస్లో ప్రతీసారి విరాట్ కోహ్లి నుంచి టీమిండియా విజయాలు ఆశించడం తగదని మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు.

రాంచీ:న్యూజిలాండ్తో జరుగుతున్న వన్డే సిరీస్లో ప్రతీసారి విరాట్ కోహ్లి నుంచి టీమిండియా విజయాలు ఆశించడం తగదని మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు. విరాట్ మోస్తరుగా రాణించినా, ఎప్పుడూ అతనే విజయాల్ని అందించాలని భావించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించాడు. ప్రతీ మ్యాచ్లోనూ విరాట్ సాయాన్ని ఆశించడం అత్యాశే అవుతుందన్నాడు.

'న్యూజిలాండ్ తో సిరీస్లో భారత ప్రతీ విజయంలో విరాట్ పాత్ర ఉండాలని కోరుకోవడం తగదు. ఆ ఆటగాడే విజయాన్ని సాధించాలని అత్యాశను వదిలి సమష్టిగా పోరాడండి' అని గవాస్కర్ తెలిపాడు. మరోవైపు గత వన్డేలో అక్షర్ పటేల్ బ్యాటింగ్ ఆర్డర్ను మార్చడాన్ని గవాస్కర్ తప్పుబట్టాడు. స్పెషలిస్టు ఆటగాళ్లు మనీష్ పాండే, కేదర్ జాదవ్లను వెనక్కునెట్టి అక్షర్ను ఐదో స్థానంలో బ్యాటింగ్ కు తీసుకురావడం అంత మంచి ప్రయోగం కాదన్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement