'రాహుల్, డుప్లెసిస్ కాదు.. ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్ అత‌డే' | Delhi Capitals Sent Top Captaincy Name For IPL 2025 Season | Sakshi
Sakshi News home page

IPL 2025: 'రాహుల్, డుప్లెసిస్ కాదు.. ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్ అత‌డే'

Feb 16 2025 11:26 AM | Updated on Feb 16 2025 12:07 PM

Delhi Capitals Sent Top Captaincy Name For IPL 2025 Season

క్రికెట్ అభిమానులను అల‌రించేందుకు మరి కొద్ది రోజుల్లో ఐపీఎల్ పండగ రాబోతుంది. ఐపీఎల్‌-2025 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. తొలి మ్యాచ్‌లో కోల్‌కతా వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడనున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి.

ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో మొత్తం 10 జట్లు తలపడనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయా ఫ్రాంచైజీ ఆటగాళ్ల రిటెన్షన్‌తో పాటు ఐపీఎల్ మెగా వేలంతో తమకు అవసరమైన ప్లేయర్లను కొనుగోలు చేశాయి. అయితే పది జట్లలో కేకేఆర్‌, ఢిల్లీ క్యాపిటల్స్ ప్రాంఛైజీలు ఇంకా తమ కెప్టెన్‌ల వివరాలను వెల్లడించలేదు.

ఈ రెండు ఫ్రాంచైజీలు తమ జట్లకు కెప్టెన్లగా వ్యవహరించిన శ్రేయస్ అయ్యర్‌, రిషబ్ పంత్‌ను వేలంలోకి విడిచిపెట్టాయి. దీంతో కొత్త కెప్టెన్ల ఎంపిక అనివార్యమైంది. కాగా ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రా‍ంచైజీ తమ జట్టు కెప్టెన్‌గా స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌(AxarPatel)ను నియమించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

జట్టులోఅనువజ్ఞుడైన కేఎల్ రాహుల్ ఉన్నప్పటికి ఢిల్లీ యాజమాన్యం అక్షర్ వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. తాజాగా ఇదే విషయంపై భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా తన అభిప్రాయాలను వెల్లడించాడు.

"ఢిల్లీ కెప్టెన్సీ రేసులో అక్షర్ పటేల్‌, రాహుల్‌, డుప్లెసిస్ ఉన్నారు. అయితే అక్ష‌ర్ ప‌టేల్‌ను మాత్రం భారీ ధ‌ర‌(రూ. 16.50) వెచ్చించి మ‌రి సొంతం చేసుకుంది. కెప్టెన్సీ రేసులో అక్ష‌ర్ అగ్ర‌స్ధానంలో ఉన్నాడ‌ని అప్పుడే మ‌నం ఆర్ధం చేసుకోవ‌చ్చు. బాపు(అక్ష‌ర్‌) ప్ర‌స్తుతం అద్భుత‌మైన ఫామ్‌లో ఉన్నాడు. 

భార‌త టీ20 జ‌ట్టు వైస్ కెప్టెన్‌గా కూడా బాధ్య‌త‌లు చేప‌ట్టాడు. అత‌డు ఛాంపియ‌న్స్ ట్రోఫీలో కూడా ఆడ‌నున్నాడు. భార‌త జ‌ట్టులో కీల‌క స‌భ్యునిగా కొన‌సాగుతున్నాడు.అత‌డు చాలా తెలివైన‌వాడు. ఆట స్థితిగ‌తుల‌ను బాగా ఆర్ధం చేసుకున్నాడు. అక్ష‌ర్‌కు జ‌ట్టును న‌డిపించే అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. కాబ‌ట్టి అత‌డిని ఢిల్లీ త‌మ కెప్టెన్‌గా ఎంపిక చేసే ఛాన్స్ ఉంద‌ని" చోప్రా త‌న యూట్యూబ్ ఛాన‌ల్‌లో పేర్కొన్నాడు.
చదవండి: CT 2025: టీమిండియాకు భారీ షాక్‌.. స్టార్‌ ఓపెనర్‌కు గాయం

Advertisement
 
Advertisement
Advertisement