ఒకప్పుడు ప్లేయర్‌.. ఇప్పుడు అదే జట్టుకు కోచ్‌గా | Amit Mishra Joins Delhi Capitals Before IPL 2027 | Sakshi
Sakshi News home page

IPL 2027: ఒకప్పుడు ప్లేయర్‌.. ఇప్పుడు అదే జట్టుకు కోచ్‌గా

Oct 21 2026 3:38 PM | Updated on Oct 21 2026 3:42 PM

Amit Mishra Joins Delhi Capitals Before IPL 2027

ఐపీఎల్-2027 సీజన్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈసారి ఎలాగైనా ట్రోఫీ గెలవాలన్న పట్టుదలతో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ తమ కోచింగ్ స్టాప్‌లో మరో మార్పు చేసింది. ఢిల్లీ ఫ్రాంచైజీ యాజమాన్యం తమ జట్టు స్పిన్ బౌలింగ్ కోచ్‌గా భారత మాజీ లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రాను నియమించింది. 

ఈ విషయాన్ని సదరు ఫ్రాంచైజీ ఎక్స్ వేదికగా వెల్లడించింది. అమిత్ మిశ్రాకు ఢిల్లీ ఫ్రాంచైజీతో ప్రత్యేక అనుబంధం ఉంది. ఐపీఎల్‌లో అమిత్ మిశ్రా తన కెరీర్‌లో ఎక్కువ భాగం ఢిల్లీ ఫ్రాంచైజీ తరఫునే ఆడాడు. దాదాపు 10 సీజన్లలో ఢిల్లీకి అతడు సారథ్యం వహించాడు. అప్పుడు ఆటగాడిగా సేవలందించిన మిశ్రా.. ఇప్పుడు కోచ్‌గా పాఠాలు నేర్పేందుకు సిద్దమయ్యాడు.

హెడ్‌కోచ్‌గా గంగూలీ
కాగా ఇప్పటికే ఢిల్లీ మేనెజ్‌మెంట్ తమ కోచింగ్ విభాగంలో పలు మార్పులు చేసింది. హెడ్‌కోచ్‌గా సౌరవ్ గంగూలీ బాధ్యతలు చేపట్టగా.. బ్యాటింగ్‌, బౌలింగ్ కోచ్‌లగా దిగ్గజ క్రికెటర్లు యువరాజ్ సింగ్‌, చమిందా వాస్ ఎంపికయ్యారు. ఇప్పుడు ఈ సెటాప్‌లో అమిత్ మిశ్రా చేరాడు.

కాగా గత 19 ఏళ్లగా ఢిల్లీని ఐపీఎల్ ట్రోఫీ అందని ద్రాక్షగా ఊరిస్తోంది. గ‌త సీజ‌న్‌లో కూడా అక్ష‌ర్ ప‌టేల్ సార‌థ్యంలోని ఢిల్లీ జ‌ట్టు దారుణ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచింది. వ‌రుస ఓట‌ముల‌తో ఢిల్లీ ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. ఈ నేప‌థ్యంలోనే పాత కోచింగ్ స్టాప్ మొత్తాన్ని ఢిల్లీ మార్చేసింది.
చదవండి: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అదరగొట్టిన పాక్‌.. ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement