ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అదరగొట్టిన పాక్‌.. ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి! | Pakistan Soar In ICC ODI Rankings After Thrashing England, Sri Lanka | Sakshi
Sakshi News home page

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అదరగొట్టిన పాక్‌.. ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి!

Oct 21 2026 2:51 PM | Updated on Oct 21 2026 3:15 PM

Pakistan Soar In ICC ODI Rankings After Thrashing England, Sri Lanka

అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) తాజాగా ప్ర‌క‌టించిన వ‌న్డే టీమ్ ర్యాంకింగ్స్‌లో పాకిస్తాన్ అద‌ర‌గొట్టింది. స్వ‌దేశంలో జ‌రుగుతున్న ట్రైసిరీస్‌లో వ‌రుస‌గా శ్రీలంక‌, పాకిస్తాన్‌ల‌పై అద్భుత విజ‌యాలు సాధించ‌డంతో పాక్ త‌మ ర్యాంక్‌ను మెరుగు ప‌రుచుకుంది.

ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి నాలుగో స్థానాన్ని కైవసం చేసుకుంది. 2027 వన్డే వరల్డ్ కప్‌నకు ఆటోమేటిక్‌గా అర్హత సాధించిన టాప్-8 జట్లలో పాక్ ఇప్పటికే ఉన్నప్పటికీ.. తాజా ర్యాంకింగ్స్ మెరుగుపడటం షాహీన్ అఫ్రిది బృందానికి మరింత ఉత్సాహాన్ని ఇస్తోంది.

కాగా గతేడాది ఆఖరిలో స్వదేశంలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో పేలవ ప్రదర్శన తర్వాత పాక్ జట్టు వన్డే కెప్టెన్‌గా షాహీన్ అఫ్రిది బాధ్యతలు చేపట్టాడు. అతడి సారథ్యంలో తొలి సిరీస్‌నే ఆస్ట్రేలియాపై 2-1తో పాక్ సొంతం చేసుకుంది.

కానీ ఆ తర్వాత బంగ్లాదేశ్ చేతిలో వైట్‌వాష్‌కు గురైంది. దీంతో షాహీన్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించనున్నారని ప్రచారం జరిగింది. కానీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అతడినే కెప్టెన్‌గా కొనసాగించింది. ఈ క్రమంలో ముక్కోణపు సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి పాక్ మంచి ఊపులో ఉంది.

ఇక ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో 115 రేటింగ్ పాయింట్లతో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా, ఆ తర్వాత న్యూజిలాండ్ (109 రేటింగ్), సౌతాఫ్రికా (104 రేటింగ్) ఉన్నాయి. సౌతాఫ్రికా కంటే పాకిస్థాన్ కేవలం ఒక్క రేటింగ్ పాయింట్ వెనుకబడి ఉండగా, ఆస్ట్రేలియా 102 రేటింగ్ పాయింట్లతో ఐదో స్ధానంలో ఉంది.
చదవండి: టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల.. భారత్, పాక్ వేర్వేరు గ్రూపుల్లో..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement