టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల.. భారత్, పాక్ వేర్వేరు గ్రూపుల్లో..! | ICC Women's U19 T20 World Cup 2027 Schedule Announced, India, Pakistan Separated | Sakshi
Sakshi News home page

టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల.. భారత్, పాక్ వేర్వేరు గ్రూపుల్లో..!

Oct 21 2026 1:10 PM | Updated on Oct 21 2026 1:13 PM

ICC Women's U19 T20 World Cup 2027 Schedule Announced, India, Pakistan Separated

source: X

మహిళల అండర్‌-19 టీ20 ప్రపంచకప్‌ 2027 షెడ్యూల్‌ను ఐసీసీ ఇవాళ ప్రకటించింది. జనవరి 21 నుంచి ఫిబ్రవరి 6 వరకు బంగ్లాదేశ్‌, నేపాల్‌ వేదికలుగా ఈ టోర్నీ జరగనుంది. ఈ టోర్నీలో భారత్‌, పాకిస్తాన్‌ వేర్వేరు గ్రూపుల్లో పోటీపడనున్నాయి. ఈ టోర్నీలో మొత్తం 16 జట్లు 41 మ్యాచ్‌ల్లో తలపడనున్నాయి.

జనవరి 22న భారత్ తొలి మ్యాచ్
భారత జట్టు జనవరి 22న వెస్టిండీస్‌తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత జనవరి 24న నేపాల్‌తో, జనవరి 26న ఐర్లాండ్‌తో తలపడుతుంది. పాకిస్తాన్‌ తమ తొలి మ్యాచ్‌లో జనవరి 22న దక్షిణాఫ్రికాతో ఆడనుంది. జనవరి 24న న్యూజిలాండ్‌తో, జనవరి 26న సమోవాతో తలపడుతుంది.

గ్రూప్‌ దశ మ్యాచ్‌లు జనవరి 26తో ముగుస్తాయి. అర్హత సాధించిన జట్లు సూపర్‌ సిక్స్‌ దశకు చేరుకుంటాయి. అక్కడి నుంచి రెండు గ్రూపుల్లో టాప్‌-2లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి.

సెమీఫైనల్స్‌ ఫిబ్రవరి 4న చటోగ్రామ్‌లో జరగనున్నాయి. ఫిబ్రవరి 6న ఫైనల్‌ నిర్వహిస్తారు. సెమీఫైనల్స్‌కు ఫిబ్రవరి 5న, ఫైనల్‌కు ఫిబ్రవరి 7న రిజర్వ్‌ డే కేటాయించారు.

ఇదీ చదవండి: IPL 2027: గుజరాత్‌ టైటాన్స్‌ స్టార్‌ ప్లేయర్లపై వేటు..!


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement