సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఆదివారం ప్రకటించింది. రెగ్యులర్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ గాయం కారణంగా జట్టుకు దూరమవడంతో... అతడి స్థానంలో సీనియర్ బ్యాటర్ రాహుల్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించారు.
అదేవిధంగా ఈ సిరీస్‌కు గిల్‌తో పాటు వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా గాయాల కారణంగా దూరమయ్యారు. సీనియర్ పేసర్లు జస్‌ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్‌తో పాటు స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌కు విశ్రాంతినివ్వగా... రవీంద్ర జడేజా ఎనిమిది నెలల తర్వాత తిరిగి వన్డే జట్టులోకి వచ్చాడు.
దిగ్గజ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి చాన్నాళ్ల తర్వాత బ్లూ జెర్సీలో సొంత అభిమానుల ముందు మైదానంలో అడుగు పెట్టనున్నారు. మరోవైపు మహారాష్ట్ర క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్ ఛాన్నాళ్ల తర్వాత జట్టులోకి తిరిగొచ్చాడు. గిల్ స్ధానంలో గైక్వాడ్‌కు చోటు దక్కింది. మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ స్ధానంలో తిలక్ వర్మకు సెలక్టర్లు పిలుపునిచ్చారు.
సంజూ మరో 'సారీ'..
ఇక భారత వన్డే జట్టులోకి రీ ఎంట్రీ ఇవ్వాలనుకున్న స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌కు మరోసారి సెలక్టర్లు మొండిచేయి చూపించారు. సఫారీలతో వన్డే సిరీస్‌కు రెగ్యూలర్ వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్‌కు చోటు దక్కింది. పంత్ కూడా ఏడాది తర్వాత వన్డే జట్టులోకి వచ్చాడు.
పంత్ గైర్హజరీలో కూడా సంజూకు చోటు దక్కలేదు. వన్డేల్లో కూడా బ్యాకప్ వికెట్ కీపర్‌గా ధ్రువ్ జురెల్‌ను సెలక్టర్లు పరిగణలోకి తీసుకుంటున్నారు. సఫారీలతో వన్డేలకు ఎంపిక చేసిన జట్టులో కూడా జురెల్ ఉన్నాడు. ఈ క్రమంలో వన్డేల్లో మంచి రికార్డు ఉన్నప్పటికి సంజూను జట్టులోకి తీసుకోకపోవడంపై నెటిజన్లు ఫైరవతున్నారు. బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌పై విమర్శల వర్షం కురుపిస్తున్నారు.
శాంసన్ చివరగా 2023 డిసెంబరులో దక్షిణాఫ్రికాపై వన్డే మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత శ్రీలంక, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలతో సిరీస్‌లకు అతడికి చోటు దక్కలేదు. ఇప్పటివరకు 16 వన్డేలు ఆడిన సంజూ 56.66 సగటుతో 510 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
భారత వన్డే జట్టు: కేఎల్ రాహుల్ (కెప్టెన్), రోహిత్, జైస్వాల్, విరాట్ కోహ్లి, తిలక్ వర్మ, పంత్, సుందర్, జడేజా, కుల్దీప్, నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, రుతురాజ్ గైక్వాడ్, ప్రసిధ్, అర్ష్‌దీప్, ధ్రువ్ జురెల్.


