ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా కాన్‌బెర్రా వేదికగా భారత్, ఆస్ట్రేలియా (India vs Australia) మధ్య రేపు (అక్టోబర్ 29) తొలి టీ20 జరుగనుంది. వన్డే సిరీస్‌ను 1-2 తేడాతో కోల్పోయిన భారత్.. టీ20 సిరీస్‌నైనా దక్కించుకొని పరువు కాపాడుకోవాలని పట్టుదలగా ఉంది.
పొట్టి ఫార్మాట్‌లో ఆస్ట్రేలియాపై భారత్‌కు మంచి ట్రాక్ రికార్డే ఉంది. ఇప్పటివరకు ఆడిన 32 మ్యాచ్‌ల్లో 20 సార్లు గెలుపొందింది. ఆసీస్ కేవలం 11 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయాలు సాధించింది. చివరిగా ఇరు జట్ల మధ్య జరిగిన 6 మ్యాచ్‌ల్లో భారత్ ఏకంగా 5 సార్లు విజయాలు సాధించింది. 2024 ప్రపంచకప్‌లో భాగంగా జరిగిన చివరి మ్యాచ్‌లో భారత్ 24 పరుగుల తేడాతో ఆసీస్‌ను చిత్తు చేసింది.
అంతకుముందు స్వదేశంలో జరిగిన 5 మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 4-1 తేడాతో కైవసం చేసుకుంది. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత యువ జట్టు ఇదే ఫామ్‌ను రేపటి నుంచి ప్రారంభం కాబోయే సిరీస్‌లోనూ కొనసాగించాలని భావిస్తుంది. ఇటీవలికాలంలో సూపర్ ఫామ్‌లో ఉండటంతో టీమిండియాపై అంచనాలు భారీగా ఉన్నాయి.
విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ విశేషంగా రాణిస్తున్నాడు. వన్‌డౌన్‌లో తిలక్ వర్మ ఆకట్టుకుంటున్నాడు. సంజూ శాంసన్ సక్సెస్ ట్రాక్‌లో ఉన్నాడు. శుభ్‌మన్ గిల్ నుంచి స్థాయికి తగ్గ ఇన్నింగ్స్‌లు బాకీ ఉన్నాయి. శివమ్ దూబే, అక్షర్ పటేల్ ఆల్‌రౌండర్లుగా సత్తా చాటుతున్నారు. వరుణ్ చక్రవర్తి మ్యాజిక్ కొనసాగుతుంది.
బుమ్రా, అర్షదీప్ సింగ్ రాణిస్తున్నారు. గంభీర సహకారంతో నెట్టుకొస్తున్న హర్షిత్ రాణా పర్వాలేదనిపిస్తున్నాడు. టీమిండియాను ప్రస్తుతం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్ ఒక్కటే కలవరపెడుతుంది. స్కై బ్యాటింగ్‌లో రాణించి చాలాకాలమైంది. ఈ ఆసీస్ సిరీస్‌లో అయినా అతను సత్తా చాటాలని అభిమానులు కోరుకుంటున్నారు.
వరుసగా విఫలమవుతున్నా మేనేజ్‌మెంట్, కోచ్ స్కైకు అండగా ఉన్నారు. వ్యక్తిగంతా విఫలమవుతున్నా జట్టును విజయవంతంగా ముందుండి నడిపిస్తున్నాడన్న కారణం చేత అతనికి మద్దతు లభిస్తుంది. అయితే ఇది ఎంతో కాలం ఉండే అవకాశం లేదు. ప్రస్తుత ఆస్ట్రేలియా సిరీస్‌లో విఫలమైతే మాత్రం సెలెక్టర్లు ప్రత్యామ్నాం వైపు చూడవచ్చు.
ఆస్ట్రేలియాతో తొలి టీ20లో భారత జట్టు (అంచనా)..
అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), సంజు శాంసన్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా


