ఐపీఎల్ 2026కి సంబంధించి ఆటగాళ్ల రిటెన్షన్, ట్రేడ్ డీల్‌కు రేపే (నవంబర్ 15) చివరి తేదీ. ఈ నేపథ్యంలో పలానా ఫ్రాంచైజీ పలానా ఆటగాడిని ట్రేడ్ చేసుకుంటుంది, పలానా ఫ్రాంచైజీ పలానా ఆటగాళ్లను రిటైన్ చేసుకుంటుందనే ప్రచారం జోరుగా సాగుతుంది.
ట్రేడ్ డీల్స్‌కు సంబంధించి చాలా అంశాలు ప్రచారంలో ఉన్నా, ఓ విషయం మాత్రం కొలిక్కి వచ్చినట్లు తెలుస్తుంది. సుదీర్ఘ చర్చల అనంతరం రాజస్థాన్ రాయల్స్-సీఎస్‌కే ఓ డీల్ కుదుర్చుకున్నాయని సమాచారం. రాయల్స్ సంజూ శాంసన్‌ను సీఎస్‌కేకు ఇచ్చి, బదులుగా రవీంద్ర జడేజా, సామ్ కర్రన్‌ను ట్రేడింగ్ చేసుకున్నట్లు తెలుస్తుంది.
ఈ ట్రేడ్ డీల్ ఆసక్తికరంగా మారిన నేపథ్యంలో గతంలో జరిగిన ట్రేడ్ డీల్స్, అందులో భాగంగా జరిగిన భారీ క్యాష్ డీల్స్‌పై ఓ లుక్కేద్దాం. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు చాలా ట్రేడ్ డీల్స్ జరిగాయి. ట్రేడ్ డీల్ అంటే ఫ్రాంచైజీలు ఆటగాళ్లను మార్చుకోవడం ఓ పద్దతి. రెండోది వేలం బయట ఆటగాళ్లను కొనుగోలు చేయడం (క్యాష్ డీల్).
ఈ ట్రేడింగ్ విండో తొలిసారి 2009 ఎడిషన్ ప్రవేశ పెట్టబడింది. ఆ ఎడిషన్‌లో ఆర్సీబీ నుంచి జహీర్ ఖాన్ ముంబై ఇండియన్స్‌కు మారాడు. ముంబై ఇండియన్స్ నుంచి రాబిన్ ఉతప్ప ఆర్సీబీకి ట్రేడ్ అయ్యాడు.
అలాగే ఢిల్లీ డేర్ డెవిల్స్ నుంచి ఆశిష్ నెహ్రా ముంబై ఇండియన్స్‌కు మారగా.. ముంబై ఇండియన్స్ నుంచి శిఖర్ ధవన్ ఢిల్లీ డేర్ డెవిల్స్‌కు ట్రేడ్ అయ్యాడు.
2012లో దినేశ్ కార్తీక్ క్యాష్ డీల్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్ నుంచి ముంబై ఇండియన్స్‌కు మారాడు.
2013లో రాస్ టేలర్ ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి పూణే వారియర్స్‌కు..
2015లో పార్థివ్ పటేల్ ఆర్సీబీ నుంచి ముంబై ఇండియన్స్‌కు.. మన్విందర్ బిస్లా కేకేఆర్ నుంచి ఆర్సీబీకి క్యాష్ డీల్ ద్వారా బదిలి అయ్యారు.
2016లో కేదార్ జాదవ్‌ను ఆర్సీబీ ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి స్వాప్ చేసుకుంది.
2019లో మన్‌దీప్ సింగ్, మార్కస్ స్టోయినిస్ విషయంలో ఆర్సీబీ-పంజాబ్ కింగ్స్ మధ్య స్వాపింగ్ జరిగింది.
2019లో శిఖర్ ధవన్‌ను డీసీ ఎస్‌ఆర్‌హెచ్ నుంచి ట్రేడ్ చేసుకుంది. శిఖర్‌కు బదులుగా ఎస్‌ఆర్‌హెచ్ డీసీ నుంచి విజయ్ శంకర్, అభిషేక్ శర్మ, నదీమ్‌ను పొందింది.
2019- అశ్విన్ (పంజాబ్ నుంచి ఢిల్లీకి, క్యాష్ డీల్, రూ. 7.6 కోట్లు)
2019- రహానే (రాజస్థాన్ నుంచి ఢిల్లీకి,స్వాపింగ్, రహానేకు బదులుగా మయాంక్ మార్కండే, రాహుల్ తెవాటియా రాయల్స్‌కు ట్రేడ్ అయ్యారు)
2019- ట్రెంట్ బౌల్ట్ (ఢిల్లీ నుంచి ముంబై ఇండియన్స్, క్యాష్ డీల్, రూ. 3.2 కోట్లు)
2020- రాబిన్ ఉతప్ప (రాజస్థాన్ నుంచి సీఎస్‌కే, క్యాష్ డీల్)
2020- డేవియల్ సామ్స్, హర్షల్ పటేల్ (డీసీ నుంచి ఆర్సీబీ, స్వాపింగ్)
2022- శార్దూల్ ఠాకూర్ (డీసీ నుంచి కేకేఆర్, క్యాష్ డీల్, రూ. 10.75 కోట్లు)
2023- ఆవేశ్ ఖాన్-దేవ్‌దత్ పడిక్కల్ (లక్నో నుంచి రాజస్థాన్, స్వాపింగ్)
2024- హార్దిక్ పాండ్యా- గుజరాత్ నుంచి ముంబై ఇండియన్స్ (క్యాష్ డీల్, రూ. 15 కోట్లు)
2024- కెమరాన్ గ్రీన్- ముంబై ఇండియన్స్ నుంచి ఆర్సీబీ (క్యాష్ డీల్, రూ. 17.5 కోట్లు)- ఐపీఎల్ చరిత్రలో ఇదే అతి భారీ క్యాష్ డీల్
చదవండి: IPL 2026: రేపే 'డెడ్‌లైన్'


