ఫైన‌ల్లో ఊచ‌కోత‌.. సంజూ శాంసన్‌ వరల్డ్‌ రికార్డు | Sanju Samson Creates History, Becomes The 1st-Ever Cricketer | Sakshi
Sakshi News home page

T20 WC 2026: ఫైన‌ల్లో ఊచ‌కోత‌.. సంజూ శాంసన్‌ వరల్డ్‌ రికార్డు

Mar 8 2026 8:32 PM | Updated on Mar 8 2026 9:17 PM

Sanju Samson Creates History, Becomes The 1st-Ever Cricketer

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2026ను టీమిండియా స్టార్‌ ఓపెనర్‌గా సంజూ శాంసన్‌ ఘనంగా ముగించాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా అహ్మ‌దాబాద్ వేదిక‌గా న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న ఫైన‌ల్లో శాంసన్‌ విధ్వంసం సృష్టించాడు. ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌ నుంచే కివీస్‌ బౌలర్లను ఉతికారేశాడు.

మాట్‌ హెన్రీ, లాకీ ఫెర్గూసన్‌ వంటి వరల్డ్‌క్లాస్‌ బౌలర్లను సైతం సంజూ విడిచిపెట్టలేదు. అతడి మెరుపు బ్యాటింగ్‌కు బౌండరీలు చిన్నబోయాయి. శాంసన్  కేవలం 46 బంతుల్లోనే 5 ఫోర్లు, 8 సిక్స్‌లతో 89 పరుగులు చేశాడు. మొత్తంగా ఈ టోర్నీలో 5 మ్యాచ్‌లు ఆడిన శాంసన్.. 80.25 సగటుతో 321 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడిన సంజూ శాంసన్ పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.

సంజూ సాధించిన రికార్డులు ఇవే
👉టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఇన్నింగ్స్ మొదటి ఓవర్‌లోనే అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్‌గా సంజూ రికార్డులెక్కాడు. సంజూ తొలి ఓవర్‌లో ఇప్పటివరకు 4 సిక్స్‌లు బాదాడు. ఇంతకుముందు ఈ రికార్డు మహ్మద్ రిజ్వాన్‌, ‍క్వింటన్ డికాక్‌, గుర్బాన్‌, సాల్ట్ పేరిట ఉండేది. వీరిందరూ తొలి ఓవర్‌లో మూడు సిక్స్‌లు బాదారు.

👉ఒక టీ20 ప్రపంచకప్ ఎడిషన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా సంజు శాంసన్ చరిత్ర సృష్టించాడు. ఈ ఏడాది ప్రపంచకప్‌లో సంజూ 21 సిక్సర్లు కొట్టాడు. ఈ క్రమంలో ఫిన్ అలెన్‌(21)ను సంజూ అధిగమించాడు.

👉ఒకే టీ20 ప్రపంచకప్ ఎడిషన్‌లో సెమీఫైనల్, ఫైనల్ రెండింటిలోనూ హాఫ్ సెంచరీలు సాధించిన మూడో ప్లేయ‌ర్‌గా శాంస‌న్ నిలిచాడు. శాంస‌న్ కంటే ముందు షాహిద్ అఫ్రిది, విరాట్ కోహ్లి ఈ ఫీట్ సాధించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement