ఐపీఎల్-2026 మినీ వేలానికి ముందు రాజస్థాన్ రాయల్స్ (RR), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మధ్య సంచలన ట్రేడ్ డీల్ జరగనున్నట్లు తెలుస్తోంది. టీమిండియా స్టార్ సంజూ శాంస్‌న్‌ను రాజస్తాన్ నుంచి ట్రేడ్ చేసుకునేందుకు సీఎస్‌కే సిద్దమైనట్లు సమాచారం.
ఐపీఎల్-2025 నుంచి శాంసన్, రాయల్స్ మధ్య విబేధాలు తలెత్తాయి. దీంతో రాజస్తాన్ ఫ్రాంచైజీని వీడాలని సంజూ నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో సంజూ శాంసన్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ తమ జట్టులోకి తీసుకోవాలని భావించింది. కానీ రాజస్తాన్, ఢిల్లీ మధ్య ట్రేడ్ డీల్ కుదరకపోయినట్లు ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి.
ఇప్పుడు సీఎస్‌కే ఎంట్రీ ఇచ్చింది. సంజూ శాంసన్‌కు బదులుగా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను ఇచ్చేందుకు సీఎస్‌కే ప్రాంఛైజీ అంగీకరించినట్లు వార్తలు వచ్చాయి. కానీ అందుకు రాజస్తాన్ ఒప్పుకోలేదంట. జడేజాతో పాటు సౌతాఫ్రికా స్టార్ క్రికెటర్ డెవాల్డ్ బ్రెవిస్‌ను కూడా ఇవ్వాలని రాయల్స్ యాజమాన్యం డిమాండ్ చేసింది.
అందుకు సీఎస్‌కే కూడా అంగీకరించింది. కానీ కొన్ని గంటల వ్యవధిలోనే రాజస్తాన్ తమ మనసు మార్చుకుంది. ఈఎస్పీఎన్ క్రిక్ఇన్‌ఫో ప్రకారం.. రాజస్తాన్ ఇప్పుడు బ్రెవిస్‌ను కాకుండా ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ సామ్ కరన్‌ను జడేజాతో పాటు కావాలని డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.
రాజస్తాన్ మాస్టర్ ప్లాన్..
ఒకే దెబ్బకు ఇద్దరు వరల్డ్ క్లాస్ ఆల్‌రౌండర్లను సొంతం చేసుకోవాలని రాజస్తాన్ ప్లాన్ చేసింది. అయితే అందుకోసం సీఎస్‌కే రూ. 2.40 కోట్లు చెల్లాంచాల్సి ఉంటుంది. శాంసన్, జడేజా ఇద్దరూ జీతం కూడా రూ. 18 కోట్లే. కాబట్టి ఇది సరిసమాన ట్రేడ్(స్వాప్ డీల్) అవుతోంది.
కానీ కుర్రాన్ సీఎస్‌కే నుంచి రూ. 2.40 కోట్లు అందుకుంటున్నాడు. దీంతో ఆ మొత్తాన్ని రాజస్తాన్ సీఎస్‌కే ఇవ్వాల్సి ఉంటుంది. అయితే సీఎస్‌కే-రాజస్తాన్ మధ్య డీల్ దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. అంతేకాకుండా సీఎస్‌కే యాజమాన్యం తమ జట్టు పగ్గాలను శాంసన్‌కు అప్పగించే యోచనలో కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇక ఐపీఎల్-2026 మినీ వేలం డిసెంబర్ ఆఖరిలో జరిగే ఛాన్స్ ఉంది. ఆయా ఫ్రాంచైజీలు నవంబర్ 15 లోపు తమ రిటెన్షన్ జాబితాను బీసీసీఐ సమర్పించాల్సి ఉంది.
ఐపీఎల్ చరిత్రలో భారీ ట్రేడ్ డీల్స్ ఇవే..
కామెరూన్ గ్రీన్-2024 సీజన్- ముంబై ఇండియన్స్ నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- రూ. 17.5 కోట్లు
హార్దిక్ పాండ్యా- 2024 సీజన్- గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై ఇండియన్స్ (MI)-రూ. 17.5 కోట్లు
శిఖర్ ధావన్- 2019 సీజన్- సన్‌రైజర్స్ హైదరాబాద్ నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ (DC)- రూ. 12.5 కోట్లు
చదవండి: ఆ ఓవరాక్షనే వద్దనేది.. అదేమైనా వరల్డ్ కప్ ట్రోఫీనా?


