హాంకాంగ్ సిక్సెస్-2025 విజేతగా పాకిస్తాన్ నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్‌లో కువైట్‌ను చిత్తు చేసిన పాక్.. రికార్డు స్దాయిలో ఆరోసారి హాంకాంగ్ సిక్సెస్ టైటిల్‌ను ముద్దాడింది. అబ్బాస్ అఫ్రిది నాయకత్వంలో పాక్ జట్టు భారత్‌పై ఓటమి పాలైనప్పటికి.. ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచ్‌లలో గెలిచి ఛాంపియన్‌గా నిలిచింది. అయితే ఫైనల్లో విజయం తర్వాత పాక్ ఆటగాడు మహ్మద్ షాజాద్ ఓవరాక్షన్ చేశాడు.
భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఐకానిక్ ట్రోఫీ సెలబ్రేషన్‌ను మహ్మద్ షాజాద్ కాపీ చేశాడు. టీ20 ప్రపంచ కప్ 2024 టైటిల్ గెలిచిన తర్వాత పాండ్యా ట్రోఫీని తన ముందు పెట్టుకుని భుజాలు ఎగరేస్తూ ఫోటోలకు పోజ్ ఇచ్చాడు. ఇప్పుడు షాజాద్ కూడా అదే విధంగా చేశాడు.
ఇందుకు సంబంధించిన ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. అందుకు క్యాప్షన్‌గా హాంగ్ కాంగ్ సిక్సెస్ టోర్నీ ఫన్ ముగిసింది. ఇక్కడ మాకు మద్దతుగా నిలిచిన అభిమానులందరికీ ధన్యవాదాలు. ఛాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకోవడం ఎల్లప్పుడూ ప్రత్యేక అనుభూతిని కలిగిస్తోంది అని షాజాద్ ఇచ్చాడు.
అయితే షాజాద్ భారత కెప్టెన్ దినేష్ కార్తీక్‌కు కౌంటర్‌గా ఈ పోస్ట్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ టోర్నీలో పాక్‌పై విజయం తర్వాత కార్తీక్ ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశాడు. పాకిస్తాన్‌పై విజయంతో హాంకాంగ్ సిక్సెస్ ఫన్ మొదలైంది అంటూ కార్తీక్ ఎక్స్‌లో రాసుకొచ్చాడు.
ఇప్పుడు ఫన్ ముగిసిందని షెజాద్ అతి చేశాడు. ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీంతో షెజాద్‌పై నెటిజన్లు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంచమైనా మీకు సిగ్గు ఉందా? సెలబ్రేషన్స్ కూడా కాపీనేనా అనా ఓ యూజర్ కామెంట్ చేశాడు. మీరు ఏమైనా వరల్డ్‌కప్ ట్రోఫీని సాధించారా? ఆ పోజులు ఏంటి? అని సొంత అభిమానుల సైతం షెజాద్‌పై ఫైరవతున్నారు.


