 
													టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ బ్యాటింగ్ ఆర్డర్‌పై గత కొంతకాలంగా చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాక టీ20ల్లో భారత ఇన్నింగ్స్‌ను సంజూ శాంసన్, అభిషేక్ శర్మ ప్రారంభించడం మొదలు పెట్టారు.
అయితే అప్పుడు శుభ్‌మన్ గిల్ టీ20 జట్టుకు దూరంగా ఉండడంతో శాంసన్‌ను ఓపెనర్‌గా అవకాశముంది. కానీ గిల్ తిరిగి టీ20 సెటాప్‌లోకి రావడంతో ఆసియాకప్-2025 నుంచి సంజూ బ్యాటింగ్ ఆర్డర్ మారిపోయింది. ఈ ఏడాది జరిగిన ఆసియాకప్‌లో భారత ఓపెనర్లుగా గిల్, అభిషేక్ శర్మ బరిలోకి దిగగా.. శాంసన్‌ను మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు పంపారు.
కొన్ని మ్యాచ్‌లలో నంబర్ 6, మరి కొన్ని మ్యాచ్‌లలో ఐదో స్ధానంలో ఈ కేరళ బ్యాటర్ బ్యాటింగ్‌కు వచ్చాడు. దీంతో టీమ్ మెనెజ్‌మెంట్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. సంజూ లాంటి అద్భుతమైన బ్యాటర్‌ను సరిగ్గా ఉపయోగించుకోవడంలేదని చాలా మంది మాజీలు మండిపడ్డారు.
సంజూకు ప్రమోషన్..
ఈ క్రమంలో మెల్‌బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టీ20లో సంజూ శాంసన్‌కు హెడ్ కోచ్ గౌతం గంభీర్ ప్రమోషన్ ఇచ్చాడు. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ త్వరగా ఔట్ కోవడంతో  శాంసన్‌ను నంబర్ 3లో బ్యాటింగ్‌కు పంపాలని టీమ్ మెనెజ్‌మెంట్ నిర్ణయించుకుంది.
కానీ సంజూ తనకు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోలేకపోయాడు. ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ 4 బంతులు ఎదుర్కొని 2 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆసీస్ పేసర్ నాథన్ ఎల్లిస్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికపోయాడు. దీంతో సోషల్ మీడియాలో సంజూను ట్రోలు చేస్తున్నారు.
టాపార్డర్‌లో అవకాశమిస్తే ఇలా ఆడుతావా అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. మరికొంత మంది శాంసన్‌ను మద్దతుగా నిలుస్తున్నారు. వేర్వేరు స్ధానాల్లో అతడిని బ్యాటింగ్‌కు పంపితే ఎలా, అతడికంటూ ఒక పొజిషన్  ఫిక్స్ చేయండి అంటూ కామెంట్లు పెడుతున్నారు.
చదవండి: కేకేఆర్‌లోకి రోహిత్ శర్మ ‘కన్‌ఫామ్’!.. స్పందించిన ముంబై ఇండియన్స్
Nathan Ellis got off to a rapid start, dismissing Sanju Samson for just two. #AUSvIND pic.twitter.com/lY4FAlbzDI
— cricket.com.au (@cricketcomau) October 31, 2025
 

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
