
27వ CEAT క్రికెట్ రేటింగ్ (CCR) అవార్డుల వేడుక నిన్న (అక్టోబర్ 7) ముంబైలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. ఇటీవలికాలంలో ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన క్రికెటర్లకు ఈ వేడుకలో పురస్కారాలు లభించాయి.
ఈ వేడుకలో మాజీ భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ప్రధాన ఆకర్షణగా నిలిచారు. భారత వన్డే జట్టు కెప్టెన్సీ నుంచి తప్పించబడిన తర్వాత రోహిత్‌కు ఇది మొదటి పబ్లిక్ అప్పియరెన్స్.
ROHIT SHARMA - THE LEADER 🐐
Ro received the Special award from CEAT for winning the Champions Trophy. pic.twitter.com/ad5GbSdAZG— Johns. (@CricCrazyJohns) October 7, 2025
ఈ వేడుకలో రోహిత్‌కు ఓ ప్రత్యేక అవార్డు లభించింది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీని గెలిపించినందుకుగానూ అతన్ని ఈ అవార్డు వరించింది. రోహిత్ నాయకత్వంలో భారత్ వరుసగా గెలిచిన రెండో ఐసీసీ ట్రోఫీ ఇది.
2024లో రోహిత్ సారథ్యంలో టీమిండియా టీ20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. రోహిత్‌కు ఈ అవార్డును భారత బ్యాటింగ్ లెజెండ్ సునీల్ గవాస్కర్ అందజేశారు.
ఈసారి CCR అవార్డులను మెజార్టీ శాతం భారత క్రికెటర్లే గెలుచుకున్నారు. అభిషేక్ శర్మ, తిలక్ వర్మను కాదని సంజూ శాంసన్ (Sanju Samson) టీ20 బ్యాటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును గెలుచుకున్నాడు.
ఇటీవలికాలంలో టీ20ల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్న మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని (Varun Chakravarthy) టీ20 బౌలర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వరించింది.
సర్పంచ్ సాబ్ శ్రేయస్ అయ్యర్‌కు (Shreyas Iyer) ఓ ప్రత్యేక అవార్డు ఇచ్చారు. CEAT JioStar అవార్డుతో అతన్ని సత్కరించారు.
మహిళల విభాగంలోనూ టీమిండియా ఆధిపత్యం కొనసాగింది. స్మృతి మంధన, దీప్తి శర్మ బెస్ట్ బ్యాటర్, బౌలర్ అవార్డులు గెలుచుకున్నారు. అయితే, వారు ఈ అవార్డులను అందుకునేందుకు రాలేకపోయారు. ప్రస్తుతం వారు వన్డే వరల్డ్‌కప్‌లో బిజీగా ఉన్నారు.
విదేశీ ఆటగాళ్ల విషయానికొస్తే.. జో రూట్‌కు అంతర్జాతీయ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది. కేన్ విలియమ్సన్‌కు వన్డే బ్యాటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది.
హ్యారీ బ్రూక్‌కు టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు లభించింది.
ఇటీవల సౌతాఫ్రికాను వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌గా నిలబెట్టిన టెంబా బవుమాకు బెస్ట్ కెప్టెన్ అవార్డు లభించింది.
బ్యాటింగ్ దిగ్గజం బ్రియాన్ లారాకు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు లభించింది.
విజేతల పూర్తి జాబితా:
ఛాంపియన్స్ ట్రోఫీ విజయానికి గుర్తుగా ప్రత్యేక అవార్డు- రోహిత్ శర్మ
లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు- బ్రియాన్ లారా
అంతర్జాతీయ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్- జో రూట్
T20I బ్యాటర్ ఆఫ్ ది ఇయర్- సంజు శాంసన్
T20I బౌలర్ ఆఫ్ ది ఇయర్- వరుణ్ చక్రవర్తి
CEAT JioStar అవార్డు- శ్రేయస్ అయ్యర్
ODI బ్యాటర్ ఆఫ్ ది ఇయర్- కేన్ విలియమ్సన్
ODI బౌలర్ ఆఫ్ ది ఇయర్- మ్యాట్ హెన్రీ
CEAT లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు- B.S.చంద్రశేఖర్
మహిళల బ్యాటర్ ఆఫ్ ది ఇయర్- స్మృతి మంధన
మహిళల బౌలర్ ఆఫ్ ది ఇయర్- దీప్తి శర్మ
ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్- అంగ్రిష్ రఘువంశీ
ఉదాత్త నాయకత్వ అవార్డు- టెంబా బవుమా
టెస్ట్ బౌలర్ ఆఫ్ ది ఇయర్- ప్రభాత్ జయసూర్య
టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్- హ్యారీ బ్రూక్
డొమెస్టిక్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్- హర్ష్ దూబే
చదవండి: ఇంగ్లండ్ కెప్టెన్ ఎంగేజ్‌మెంట్.. పాక్ ఓవరాక్షన్ స్పిన్నర్ రిసెప్షన్