ఐపీఎల్-2026 సీజన్ మినీ వేలానికి ముందు రాజస్తాన్ రాయల్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య స్వాప్ ట్రేడ్ డీల్ అధికారికంగా పూర్తి అయింది. రాజస్తాన్ కెప్టెన్ సంజూ శాంసన్‌ను సీఎస్‌కే ట్రేడ్ చేసుకుంది. అందుకు బదులుగా సీఎస్‌కే స్టార్ ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, సామ్ కుర్రాన్‌లను రాజస్తాన్‌కు పంపింది.
గత సీజన్‌కు ముందు జడేజాను రూ.18 కోట్ల భారీ వెచ్చించి సీఎస్‌కే రిటైన్ చేసుకుంది. ఇప్పుడు జడేజా ధరను రూ.14 కోట్లకు తగ్గించి రాజస్తాన్ ట్రేడ్ చేసుకుంది. ఐపీఎల్ 2026 సీజన్‌లో రవీంద్ర జడేజా రూ.14 కోట్లు అందుకోబోతున్నాడు. సామ్ కుర్రాన్‌ను మాత్రం రూ. 2.4 కోట్ల ప్రస్తుత ధరకే రాయల్స్ తమ జట్టులోకి తీసుకుంది.
అయితే సంజూ శాంసన్ మాత్రం ధర మారలేదు. అతడు సీఎస్‌కే నుంచి రూ.18 కోట్లు అందుకోనున్నాడు. ఈ ట్రేడ్ డీల్‌ను సీఎస్‌కే సోషల్ మీడియా వేదికగా ధ్రువీకరించింది. తమ ఫ్రాంచైజీకి ప్రాతినిథ్యం వహించినందుకు సీఎస్‌కే యాజమాన్యం ధన్యవాదాలు తెలిపింది. జడేజా 12 సీజన్ల పాటు సీఎస్‌కే తరపున ఆడాడు.
లక్నోకి సచిన్ తనయుడు..
ఐపీఎల్ 2026 వేలానికి ముందు ఫ్రాంఛైజీలు ఆటగాళ్ల రిటెన్షన్ జాబితాను సమర్పించడానికి నేడే ఆఖరి రోజు కావడంతో మరికొన్ని ముఖ్యమైన ట్రేడ్ డీల్స్ జరిగాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ నుంచి స్టార్ పేసర్ మహ్మద్ షమీని రూ.10 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ ట్రేడ్ చేసుకుంది.
అదేవిధంగా లెగ్ స్పిన్నర్ మయాంక్ మార్కండేను కోల్‌కతా నైట్‌రైడర్స్ నుంచి ముంబై ఇండియన్స్ రూ.30 లక్షల బెస్‌ప్రైస్‌కు ట్రేడ్ చేసుకుంది. సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్‌ను అతడి ధర రూ.30 లక్షలకు లక్నో ట్రేడ్ చేసుకుంది.
Aaj rumour nahi, headline likhna. Ravindra 𝑻𝒉𝒂𝒍𝒂𝒑𝒂𝒕𝒉𝒚 Jadeja is coming home ⚔️🔥 pic.twitter.com/XJT5b5plCy
— Rajasthan Royals (@rajasthanroyals) November 15, 2025
ఇప్పటివరకు జరిగిన ట్రేడ్ డీల్స్ ఇవే..
1.రవీంద్ర జడేజా- చెన్నై సూపర్ కింగ్స్ టూ రాజస్థాన్ రాయల్స్
2. సంజూ శాంసన్- రాజస్థాన్ రాయల్స్ టూ చెన్నై సూపర్ కింగ్స్
3. సామ్ కుర్రాన్ -చెన్నై సూపర్ కింగ్స్ టూ రాజస్థాన్ రాయల్స్
4. మహ్మద్ షమీ- సన్‌రైజర్స్ హైదరాబాద్ టూ లక్నో సూపర్ జెయింట్స్
5. నితీష్ రాణా- రాజస్థాన్ రాయల్స్ టూ ఢిల్లీ క్యాపిటల్స్
6.అర్జున్ టెండూల్కర్- ముంబై ఇండియన్స్ టూ లక్నో సూపర్ జెయింట్స్
7. మయాంక్ మార్కండే- కోల్‌కతా నైట్ రైడర్స్ టూ ముంబై ఇండియన్స్
8. డోనోవన్ ఫెరీరా - ఢిల్లీ క్యాపిటల్స్ టూ రాజస్థాన్ రాయల్స్
9. శార్దూల్ ఠాకూర్ - లక్నో సూపర్ జెయింట్స్ టూ ముంబై ఇండియన్స్


