
భారత జెర్సీలో సంజూ శాంసన్(పాత ఫోటో)
రంజీ ట్రోఫీ 2025–26 సీజన్ కోసం 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును కేరళ క్రికెట్ అసోసియేషన్ ప్రకటించింది. ఈ సందర్భంగా కేసీఎ కీలక నిర్ణయం తీసుకుంది. సచిన్ బేబీ స్థానంలో మహమ్మద్ అజారుద్దీన్ కొత్త కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.
అదేవిధంగా గత సీజన్‌కు దూరంగా ఉన్న సంజూ శాంసన్(Sanju Samson) తిరిగి జట్టులోకి వచ్చాడు. సంజూ జట్టుకు ఎంపికైనప్పటికి కేరళ ఆడే తొలి మ్యాచ్‌కు దూరంగా ఉండే అవకాశముంది. ఆక్టోబర్ 15 నుంచి 18 వరకు కేరళ-మహారాష్ట్ర జట్లు తలపడనున్నాయి.
ఇదే సమయంలో సంజూ ఆసీస్ పర్యటనకు వెళ్లనున్నాడు. ఆసీస్‌తో టీ20 సిరీస్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో శాంసన్ సభ్యునిగా ఉన్నాడు. ఆసీస్ నుంచి తిరిగొచ్చాక పూర్తి స్ధాయిలో తన రాష్ట్ర జట్టుకు అతడు అందుబాటులో ఉండే అవకాశముంది.
వైస్ కెప్టెన్‌గా అపరాజిత్..
ఇక రాబోయే రంజీ సీజన్‌కు ముందు తమిళనాడు ఆటగాడు బాబా అపరాజిత్ కేరళ క్రికెట్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీంతో అతడికి కూడా ఈ జట్టులో చోటు దక్కింది. వైస్ కెప్టెన్‌గా అపరాజిత్ ఎంపికయ్యాడు. ఎం డి నిధీష్, సల్మాన్ నిజార్, వత్సల్ గోవింద్ వంటి ఆటగాళ్లు జట్టులో ఉన్నారు.
రంజీ ట్రోఫీకి కేరళ జట్టు
మహ్మద్ అజారుద్దీన్ (కెప్టెన్), బాబా అపరాజిత్ (వైస్ కెప్టెన్), సంజు శాంసన్, రోహన్ ఎస్ కున్నుమ్మల్, వత్సల్ గోవింద్ శర్మ, అక్షయ్ చంద్రన్, సచిన్ బేబీ, సల్మాన్ నిజార్, అంకిత్ శర్మ, నిధీష్ ఎండి, బాసిల్ ఎన్‌పి, అహమ్మద్ ఇమ్రాన్, షోన్ రోజర్, అభిషేక్
చదవండి: 'మీ అన్నయ్య లాంటి వాడిని'.. ముషీర్‌కు సారీ చెప్పిన పృథ్వీ షా