
ముంబై, మహారాష్ట్ర రంజీ ట్రోఫీ వార్మాప్ మ్యాచ్‌లో ముషీర్ ఖాన్-పృథ్వీ షా(Prithvi Shaw) మధ్య చోటు చేసుకున్న వివాదానికి ఎండ్ కార్డ్ పడినట్లు తెలుస్తోంది. ముషీర్‌కు పృథ్వీ క్షమాపణలు చెప్పినట్లు సమాచారం. "పృథ్వీ షా తన తప్పును తెలుసుకుని ముషీర్‌కు క్షమాపణలు చెప్పాడు.
పృథ్వీ అతడితోతో నేను నీకు అన్నయ్య లాంటివాడిని అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఇద్దరి మధ్య ఎటువంటి విబేధాలు లేవు. అంతా బాగానే ఉంది" మహారాష్ట్ర క్రికెట్ అసోయేషిన్ వర్గాలు వెల్లడించాయి.
అసలేమి జరిగిందంటే?
రంజీ ట్రోఫీ 2025-26 సీజన్‌కు ముందు ముంబై, మహారాష్ట్ర జట్లు ప్రాక్టీస్ మ్యాచ్‌లో తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో మహారాష్ట్ర తరపున ఆడిన పృథ్వీ షా(181) భారీ సెంచరీతో చెలరేగాడు. తొలి రోజు ఆట ముగిస్తుందన్న సమయంలో పృథ్వీ.. ముషీర్ ఖాన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించాడు.
ముషీర్ వికెట్ తీసిన తర్వాత "థాంక్యూ" అని కాస్త వ్యంగ్యంగా అన్నాడు. దీంతో పృథ్వీ షా కోపంతో ఊగిపోయాడు. ముషీర్‌ను బ్యాట్‌తో కొట్టేందుకు అతడు వెళ్లాడు. అంపైర్‌లు, సహచర ఆటగాళ్లు జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది.
అయితే ఈ వ్యవహరంపై ముంబై క్రికెట్ అసోయేషిన్, మహారాష్ట్ర క్రికెట్ అసోయేషిన్(MCA) సీరియస్ అయ్యాయి. ఈ రెండు క్రికెట్ అసోయేషిన్‌లు విచారణకు ఆదేశించాయి. అంతలోనే ముషీర్‌కు పృథ్వీ సారీ వివాదాన్ని ముగించాడు. అయినప్పటికి తమ క్రమశిక్షణ నియమావళిని ఉల్లఘించినందుకు మహారాష్ట్ర క్రికెట్ అసోయేషిన్ ఏదైనా చర్య తీసుకుంటుందో లేదో వేచి చూడాలి.
ముంబై క్రికెట్ అసోసియేషన్‌తో విబేధాల కారణంగా పృథ్వీ షా తన మకాంను మహారాష్ట్రకు మార్చాడు. రాబోయో రంజీ సీజన్ కోసం మహారాష్ట్ర జట్టులో పృథ్వీకి చోటు దక్కింది.
చదవండి: దిగ్గజాల సరసన యశస్వి జైస్వాల్.. భారత రెండో బ్యాటర్‌గా..