
వెస్టిండీస్‌తో రెండో టెస్టులో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ శతక్కొట్టాడు. ఢిల్లీ వేదికగా శుక్రవారం నాటి తొలిరోజు ఆట సందర్భంగా ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. 145 బంతుల్లో వంద పరుగుల మార్కు అందుకున్నాడు. భారత తొలి ఇన్నింగ్స్ యాభైవ ఓవర్ తొలి బంతికి రెండు పరుగులు తీసి జైసూ.. సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
కాగా టెస్టు కెరీర్‌లో జైస్వాల్‌కు ఇది ఏడో శతకం కావడం విశేషం. ఈ క్రమంలో ఈ ఓపెనింగ్ బ్యాటర్ అరుదైన క్లబ్‌లో చేరాడు. 24 ఏళ్ల వయసు కంటే ముందే టెస్టుల్లో అత్యధిక సెంచరీలు బాదిన దిగ్గజాల సరసన నిలిచాడు. టీమిండియా లెజెండరీ బ్యాటర్ సచిన్ టెండుల్కర్ తర్వాత ఈ ఘనత సాధించిన భారత రెండో బ్యాటర్‌గా జైసూ చరిత్రకెక్కాడు.
ఇక 23 ఏళ్ల జైస్వాల్ 2023లో వెస్టిండీస్‌తో టెస్టు సందర్భంగా అరంగేట్రం చేసి.. తొలి మ్యాచ్‌లోనే శతక్కొట్టిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అతడు వెనుదిరిగి చూసుకోలేదు. ముఖ్యంగా టెస్టుల్లో టీమిండియా ఓపెనర్‌గా పాతుకుపోయిన జైసూ.. తాజాగా మరోసారి సెంచరీతో మెరిశాడు.
ఇదిలా ఉంటే.. తొలి టెస్టులో విండీస్‌ను ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో చిత్తు చేసిన టీమిండియా.. వైట్‌వాష్‌పై గురిపెట్టింది. రెండో టెస్టు తొలిరోజు టీ బ్రేక్ సమయానికి 58 ఓవర్ల ఆట పూర్తి చేసుకుని వికెట్ నష్టానికి 220 పరుగులు చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ 38 పరుగులకే నిష్క్రమించగా.. జైసూ 162 బంతుల్లో 111, వన్‌డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ 132 బంతుల్లో 71 పరుగులతో క్రీజులో ఉన్నారు.
24 ఏళ్ల వయసు కంటే ముందే టెస్టుల్లో అత్యధిక సెంచరీలు బాదిన క్రికెటర్లు వీరే
🏏డాన్ బ్రాడ్‌మన్ (ఆస్ట్రేలియా)- 12
🏏సచిన్ టెండుల్కర్ (ఇండియా)-11
🏏గ్యారీ సోబర్‌ఫీల్డ్ (వెస్టిండీస్)- 9
🏏జావేద్ మియాందాద్ (పాకిస్తాన్), గ్రేమ్ స్మిత్ (సౌతాఫ్రికా), అలిస్టర్ కుక్ (ఇంగ్లండ్), కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్), యశస్వి జైస్వాల్ (ఇండియా)-7.
చదవండి: విండీస్‌తో రెండో టెస్ట్.. చరిత్ర సృష్టించిన బుమ్రా
What a player! 👏@ybj_19 joins South African icon #GraemeSmith to score the most Test tons (7) by an opener aged 23 or younger! 🙌
Catch the LIVE action 👉 https://t.co/8pkqpa9s4Z#INDvWI 👉 2nd Test, Day 1 | Live Now on Star Sports & JioHotstar pic.twitter.com/aig46QChOd— Star Sports (@StarSportsIndia) October 10, 2025