విండీస్‌తో రెండో టెస్ట్‌.. చరిత్ర సృష్టించిన బుమ్రా | Jasprit Bumrah Creates History: First Indian Pacer with 50 Matches in All Formats | Sakshi
Sakshi News home page

విండీస్‌తో రెండో టెస్ట్‌.. చరిత్ర సృష్టించిన బుమ్రా

Oct 10 2025 12:22 PM | Updated on Oct 10 2025 12:36 PM

IND VS WI 2nd Test: Bumrah becomes the first Indian fast bowler to complete 50 matches in all formats

వెస్టిండీస్‌తో ఇవాళ (అక్టోబర్‌ 10) మొదలైన రెండో టెస్ట్‌లో టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్‌ బుమ్రా (Jasprit Bumrah) రంగంలోకి దిగకుండానే ఓ రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌తో టెస్ట్‌ల్లో హాఫ్‌ సెంచరీ (50 మ్యాచ్‌లు) పూర్తి చేసిన అతను.. భారత్‌ తరఫున మూడు ఫార్మాట్లలో 50 మ్యాచ్‌లు ఆడిన తొలి ఫాస్ట్‌ బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. భారత క్రికెట్‌ చరిత్రలో ఇప్పటివరకు ఏ ఫాస్ట్‌ బౌలర్‌ మూడు ఫార్మాట్లలో 50 మ్యాచ్‌లు ఆడలేదు.

31 ఏళ్ల బుమ్రా ఇప్పటివరకు భారత్‌ తరఫున 50 టెస్ట్‌లు, 89 వన్డేలు, 75 టీ20లు ఆడాడు. 2016 జనవరిలో అంతర్జాతీయ అరంగేట్రం చేసి మూడు ఫార్మాట్లలో 467 వికెట్లు తీశాడు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. న్యూఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేస్తుంది. టీమిండియా టెస్ట్‌ జట్టు కెప్టెన్‌గా శుభ్‌మన్‌ గిల్‌ తొలిసారి టాస్‌ గెలిచాడు.

లంచ్‌ సమయానికి భారత్‌ వికెట్‌ నష్టానికి 94 పరుగులు చేసింది. కేఎల్‌ రాహుల్‌ 54 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో 38 పరుగులు చేసి ఔటయ్యాడు. యశస్వి జైస్వాల్‌ 40, సాయి సుదర్శన్‌ 16 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. రాహుల్‌ వికెట్‌ వార్రికన్‌కు దక్కింది. అతడి బౌలింగ్‌లో రాహుల్‌ స్టంపౌటయ్యాడు.

కాగా, రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ కోసం వెస్టిండీస్‌ జట్టు భారత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో భారత్‌ ఇన్నింగ్స​్‌ 140 పరుగుల తేడాతో విండీస్‌ను చిత్తు చేసింది. ఆ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లు రాహుల్‌, జురెల్‌, జడేజా సెంచరీలు చేశారు. సిరాజ్‌, జడేజా బంతితో రాణించారు.  

చదవండి: 'టీమిండియా'పై కేసు.. గట్టిగా అక్షింతలు వేసిన ఢిల్లీ హైకోర్టు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement