శ్రీకాంత్‌ పరాజయం | Kidambi Srikanth loses in German Open World Tour Super 300 badminton tournament | Sakshi
Sakshi News home page

శ్రీకాంత్‌ పరాజయం

Feb 27 2026 12:55 AM | Updated on Feb 27 2026 12:55 AM

Kidambi Srikanth loses in German Open World Tour Super 300 badminton tournament

ముల్హీమ్‌ అన్‌ డెర్‌ రుర్‌: జర్మన్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–300 బ్యాడ్మింటన్‌ టోర్నీ భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ఆంధ్రప్రదేశ్‌ ప్లేయర్, ప్రపంచ మాజీ నంబర్‌వన్‌ కిడాంబిశ్రీకాంత్‌ 14–21, 9–21తో లిన్‌ చున్‌ యి (చైనీస్‌ తైపీ) చేతిలో ఓడిపోయాడు. 

32 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్‌ తొలి గేమ్‌లో 9–2తో ఆధిక్యంలో ఉన్నప్పటికీ దానిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. రెండో గేమ్‌లో మాత్రం ఆరంభం నుంచే చైనీస్‌ తైపీ ప్లేయర్‌ ఆధిపత్యం చలాయించాడు. తొలి రౌండ్‌లో శ్రీకాంత్‌ 21–12, 21–11తో  జిమానవ్‌స్కీ (పోలాండ్‌)పై గెలిచాడు. మహిళల సింగిల్స్‌లో భారత ప్లేయర్లు ఆకర్షి కశ్యప్, మాళవిక, తస్నిమ్‌ మీర్, రక్షిత శ్రీ, తన్వీ శర్మ, ఇషారాణి బారువా తొలి రౌండ్‌లోనే వెనుదిరిగారు.    

Advertisement
 
Advertisement
Advertisement