టీ20 ప్రపంచకప్-2026లో టీమిండియా యువ ఆటగాడు తిలక్ వర్మ కీలక మ్యాచ్‌లో తన ఫామ్‌ను అందుకున్నాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా చెన్నై వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న సూపర్-8లో తిలక్ విధ్వంసం సృష్టించాడు.
ఆరో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన తిలక్.. ప్రత్యర్ధి బౌలర్లను ఉతికారేశాడు. చెపాక్ మైదానంలో బౌండరీల వర్షం కురిపించాడు. ఈ హైదరాబాదీ హార్దిక్ పాండ్యాతో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. కేవలం 16 బంతుల్లోనే 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 44 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
అతడితో పాటు హార్దిక్ పాండ్యా(50 నాటౌట్), అభిషేక్ శర్మ(55) హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు. ఫలితంగా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. జింబాబ్వే బౌలర్లలో మోపోసా,నగరవా, ముజర్బానీ తలా వికెట సాధించారు. అయితే సెమీస్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత బ్యాటర్లు చెలరేగడం విశేషం.


