భారత టీ20 జట్టు ఓపెనర్లుగా గత కొంతకాలంగా సంజూ శాంసన్- అభిషేక్ శర్మ జోడీ కొనసాగుతోంది. ఆసియా టీ20 కప్ సందర్భంగా శుబ్‌మన్ గిల్ (Shubman Gill) టీమ్‌లోకి తిరిగి రావడంతో కొన్నాళ్లపాటు సంజూ బెంచ్‌కే పరిమితం అయ్యాడు. అయితే, గిల్ కూడా ఓపెనర్‌గా విఫలం కావడం సంజూకు కలిసి వచ్చింది.
ఈ నేపథ్యంలో న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌తో పాటు టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో కూడా సంజూ శాంసన్‌కే ఓపెనర్‌గా అవకాశం దక్కింది. టెస్టు, వన్డే జట్ల కెప్టెన్ అయిన గిల్‌పై వేటు వేసి మరీ.. ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్‌కు మరో అవకాశం ఇచ్చింది యాజమాన్యం.
సెలక్టర్ల వమ్ము చేస్తున్న సంజూ
అయితే, సంజూ మాత్రం సెలక్టర్ల నమ్మకాన్ని నిలబెట్టలేకపోతున్నాడు. కివీస్‌తో మూడు మ్యాచ్‌లలో అతడు చేసిన స్కోర్లు (10, 6, 0) ఇందుకు నిదర్శనం. మరోవైపు.. దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటి టీమిండియాలో రీఎంట్రీ ఇచ్చిన ఇషాన్ కిషన్ అద్భుత ప్రదర్శనలతో దుమ్ములేపుతున్నాడు.
పేలుతున్న జార్ఖండ్ డైనమైట్
న్యూజిలాండ్‌తో తొలి మ్యాచ్‌లో విఫలమైనా (8).. రెండో టీ20లో 32 బంతుల్లో 76, మూడో టీ20లో 13 బంతుల్లో 28 పరుగులతో సత్తా చాటాడు ఇషాన్. తద్వారా జట్టులో తన స్థానం సుస్థిరం చేసుకునే దిశగా దూసుకుపోతున్నాడు ఈ జార్ఖండ్ డైనమైట్.
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశాడు. సంజూ వైఫల్యాలు కొనసాగితే.. వరల్డ్‌కప్ టోర్నీలో భారత తుదిజట్టు నుంచి అతడిని తప్పించడం ఖాయమని అభిప్రాయపడ్డాడు. అదే విధంగా ప్రస్తుత ఫామ్ దృష్ట్యా ఇషాన్ కిషన్‌ను జట్టు నుంచి ఎవరూ తప్పించలేరని పేర్కొన్నాడు.

ఇషాన్‌ను తుదిజట్టు నుంచి తప్పించలేరు
"ఇప్పటి పరిస్థితులను బట్టి చూస్తే సెలక్టర్లు ఇషాన్‌ను తుదిజట్టు నుంచి తప్పించలేరు. ఇందుకు అవకాశమే లేదు. సంజూ శాంసన్ కంటే అతడు ఎంతో మెరుగ్గా ఆడుతున్నాడు. సంజూను చూస్తుంటే బాధగా ఉంది.
పరుగులు చేయాలనే కసి అతడిలో కనిపిస్తోంది. కానీ సరిగ్గా ఆడలేకపోతున్నాడు. గత మ్యాచ్‌లో కనీసం నామమాత్రపు స్కోరైనా చేసి ఉండాల్సింది. నిలకడలేని ఆట తీరే సంజూకు ప్రధాన సమస్య. ఏడాదిన్నర క్రితం సెంచరీ చేశాడు. ఆ తర్వాత ఇదే తంతు కొనసాగుతోంది.
సంజూపై వేటు తప్పదు
ఏదేమైనా సంజూ దురదృష్టవంతుడనే చెప్పాలి. అతడికి గట్టి పోటీ ఉంది. తిలక్ వర్మ, ఇషాన్ కిషన్ జట్టులో పాతుకుపోయే ప్రయత్నంలో ఉన్నారు. అభిషేక్ శర్మను ఎవరూ కదిలించలేరు. ఇషాన్ వంటి వికెట్ కీపర్ బ్యాటర్ డేంజరస్ ఫామ్‌లో ఉన్నపుడు సంజూ తుదిజట్టులో చోటు కోల్పోయే అవకాశాలే ఎక్కువ’’ అని చిక్కా అభిప్రాయపడ్డాడు. ఓపెనర్‌గా ఇషాన్ సంజూ స్థానాన్ని భర్తీ చేసే అవకాశం లేకపోలేదని పేర్కొన్నాడు.
చదవండి: ICC: వెనక్కి తగ్గిన బంగ్లాదేశ్.. ఆ పని చేయబోము
Ishan-daar. Jabardast. Zindabaad. 🔥
Started with a 2nd-ball six & Ishan Kishan is straightaway showing his intent in this run chase! 💪
He is certainly on a mission to DEFEAT HISTORY! 🎯
Watch Bhojpuri commentary on JioHotstar #INDvNZ, 3rd T20I | LIVE NOW 👉… pic.twitter.com/YY3fnv3WvD— Star Sports (@StarSportsIndia) January 25, 2026


