ఓ ఇంటివాడైన టీమిండియా స్టార్‌ క్రికెటర్‌.. ఫోటోలు, వీడియోలు వైరల్‌ | Kuldeep Yadav Marries Vanshika Chaddha In Dreamy Mussoorie Wedding | Sakshi
Sakshi News home page

ఓ ఇంటివాడైన టీమిండియా స్టార్‌ క్రికెటర్‌.. ఫోటోలు, వీడియోలు వైరల్‌

Mar 15 2026 9:01 AM | Updated on Mar 15 2026 12:33 PM

Kuldeep Yadav Marries Vanshika Chaddha In Dreamy Mussoorie Wedding

టీమిండియా స్టార్ స్పిన్న‌ర్ కుల్దీప్ యాద‌వ్ ఓ ఇంటివాడ‌య్యాడు. శ‌నివారం ముస్సోరీ వేదికగా తన చిన్ననాటి స్నేహితురాలు వంశిక చద్దాను అతడు వివాహమాడాడు. స్ధానిక‌ సవోయ్‌ హోటల్‌లో వీరిద్దరి పెళ్లి ఘ‌నంగా జ‌రిగింది. ఈ వివాహ వేడుక‌కు భార‌త స్టార్ క్రికెట‌ర్లు తిలక్ వర్మ, రింకూ సింగ్, యుజ్వేంద్ర చాహల్‌తో పాటు మాజీలు సురేష్ రైనా, చావ్లా, ఆర్పీ సింగ్ హాజ‌రై సంద‌డి చేశారు.

ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు వైర‌ల‌వుతున్నాయి. దీంతో సోష‌ల్ మీడియా వేదిక‌గా కుల్దీప్-వంశిక జంటకు నెటిజన్లు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా మార్చి 17న‌ లక్నోలో భారీ ఎత్తున రిసెప్షన్ నిర్వహించనున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి విరాట్ కోహ్లి, రోహిత్ శ‌ర్మ‌, ధోని వంటి క్రికెట‌ర్ల‌తో పాటు ప‌లువురు రాజకీయ, వ్యాపార రంగ ప్రముఖులు హాజ‌రు కానున్న‌ట్లు స‌మాచారం.

కాగా వాస్త‌వానికి వీరి వివాహం గతేడాది నవంబర్‌లో జరగాల్సి ఉంది. అయితే, 2026 టీ20 ప్రపంచకప్ దృష్టి సారించేందుకు కుల్దీప్ తన పెళ్లిని వాయిదా వేసుకున్నాడు.  కుల్దీప్-వంశికకు చిన్న‌త‌నం నుంచే ప‌రిచయం ఉంది. వీరిద్దరి ఇళ్లు  కాన్పూర్‌లో కేవలం 3 కిలోమీటర్ల దూరంలోనే ఉంటాయి. 

ఆ పరిచయం కాస్త ప్రేమ‌గా మారి ఇప్పుడు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. కుల్దీప్ తిరిగి ఐపీఎల్‌పై దృష్టి పెట్టనున్నాడు. త్వరలోనే ఢిల్లీ క్యాపిటల్స్ క్యాంపులో అతడు చేరనున్నాడు. ఐపీఎల్‌-2026 సీజన్ మార్చి 28 నుంచి ప్రారంభం కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement