
ఇంగ్లండ్‌తో మూడో టెస్టులో టీమిండియా స్టార్ కేఎల్ రాహుల్ (KL Rahul) శతకంతో మెరిశాడు. లార్డ్స్‌లో నిలకడైన ప్రదర్శనతో 176 బంతుల్లో వంద పరుగుల మార్కు అందుకున్నాడు. అతడి ఇన్నింగ్స్‌లో 13 ఫోర్లు ఉన్నాయి.
కాగా రాహుల్‌కు ఇది టెస్టుల్లో పదో సెంచరీ కాగా.. ఇంగ్లండ్‌లో ఓవరాల్‌గా నాలుగోది. అదే విధంగా.. లార్డ్స్‌లో ఇది రెండోది కావడం విశేషం. తద్వారా దిలీప్ వెంగ్‌సర్కార్ తర్వాత లార్డ్స్ మైదానంలో రెండు శతకాలు సాధించిన రెండో భారత క్రికెటర్‌గా రాహుల్ చరిత్ర సృష్టించాడు.
అయితే, దురదృష్టవశాత్తూ సెంచరీ పూర్తైన వెంటనే రాహుల్ అవుటయ్యాడు. ఇంగ్లండ్ యువ బౌలర్ షోయబ్ బషీర్ స్పిన్ మాయాజాలంలో చిక్కుకున్న రాహుల్.. హ్యారీ బ్రూక్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో నిరాశగా రాహుల్ క్రీజును వీడాడు.
కాగా టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీలో భాగంగా భారత్ ఇంగ్లండ్‌తో ఐదు టెస్టులు ఆడుతోంది. లీడ్స్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో ఓడిన గిల్ సేన.. ఎడ్జ్‌బాస్టన్‌లో చారిత్రాత్మక విజయంతో ఆతిథ్య జట్టుపై ప్రతీకారం తీర్చుకుంది.
ఇరుజట్ల మధ్య లండన్‌లోని లార్డ్స్‌లో మూడో టెస్టు జరుగుతుండగా.. టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 387 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా ఐదు వికెట్ల ప్రదర్శనతో అదరగొట్టగా.. నితీశ్ కుమార్ రెడ్డి, మహ్మద్ సిరాజ్ తలా రెండు, రవీంద్ర జడేజా ఒక వికెట్ దక్కించుకున్నారు.
ఇక రెండో రోజు బ్యాటింగ్ మొదలుపెట్టిన టీమిండియా.. శుక్రవారం నాటి రెండో రోజు ఆట పూర్తయ్యేసరికి మూడు వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. 53 పరుగుల వ్యక్తిగత స్కోరుతో శనివారం నాటి ఆట మొదలుపెట్టిన కేఎల్ రాహుల్ సెంచరీ పూర్తైన వెంటనే పెవిలియన్ చేరాడు.
ఇక భారత బ్యాటర్లలో మిగతా వారిలో ఓపెనర్ యశస్వి జైస్వాల్ (13) విఫలం కాగా.. వన్‌డౌన్ బ్యాటర్ కరుణ్ నాయర్ 40 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. కెప్టెన్ గిల్ (16) నిరాశపరచగా.. రిషభ్ పంత్ 74 పరుగులు చేశాడు. 74 ఓవర్ల ఆట ముగిసే సరికి టీమిండియా ఐదు వికెట్ల నష్టానికి 267 పరుగులు చేసింది.
లార్డ్స్ మైదానంలో టెస్టుల్లో సెంచరీ చేసిన భారత క్రికెటర్లు వీరే
🏏దిలీప్ వెంగ్‌సర్కార్- 3
🏏కేఎల్ రాహుల్-2
🏏వినూ మన్కడ- 1
🏏గుండప్ప విశ్వనాథ్- 1
🏏రవిశాస్త్రి- 1
🏏మహ్మద్ అజారుద్దీన్- 1
🏏సౌరవ్ గంగూలీ- 1
🏏అజిత్ అగార్కర్-1
🏏రాహుల్ ద్రవిడ్-1
🏏అజింక్య రహానే-1.
చదవండి: IND vs ENG 1st Test: ఎంత పనిచేశావు వైభవ్.. నిన్నే నమ్ముకున్నాముగా
At Lords, @klrahul delivered yet again, his 2nd century on this historic ground, becoming only the 2nd Indian to do so. #ENGvIND 👉 3rd TEST, DAY 3 | LIVE NOW on JioHotstar 👉 https://t.co/YhqadvE3Be pic.twitter.com/IvPIBFIBKY
— Star Sports (@StarSportsIndia) July 12, 2025