
ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ దుమ్ములేపుతున్నాడు. లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో పంత్ అద్బుతమైన నాక్ ఆడాడు. ఓవైపు చేతి వేలి గాయంతో పోరాడుతూనే కీలక ఇన్నింగ్స్ ఆడాడు. తొలి ఇన్నింగ్స్‌లో 112 బంతులు ఎదుర్కొని 8 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 74 పరుగులు చేశాడు. ఈ క్రమంలో పంత్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.
పంత్ సాధించిన రికార్డులు ఇవే..
👉టెస్టు క్రికెట్‌లో ఇంగ్లండ్‌పై అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా రిషబ్ పంత్ వరల్డ్ రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు ఇంగ్లండ్‌పై 15 టెస్టులు ఆడిన పంత్.. 36 సిక్సర్లు బాదాడు. ఇంతకుముందు ఈ రికార్డు వెస్టిండీస్ దిగ్గజ బ్యాటర్ వివ్ రిచర్డ్స్ పేరిట ఉండేది.
రిచర్డ్స్ తన17 ఏళ్ల టెస్ట్ కెరీర్‌లో ఇంగ్లండ్‌పై 36 టెస్టులు ఆడి 34 సిక్సర్లు కొట్టాడు. తాజా మ్యాచ్‌లో రెండు సిక్సర్లు బాదిన పంత్.. విండీస్ గ్రేట్‌ను ఆధగమించాడు.
👉అదేవిధంగా ఇంగ్లండ్ గడ్డపై టెస్టుల్లో అత్యధిక యాభైకి పైగా స్కోర్లు పర్యాటక వికెట్ కీపర్‌గా ఎంఎస్ ధోని రికార్డును పంత్ సమం చేశాడు. ఇంగ్లండ్‌లో ధోని 8 సార్లు ఏభైకి పైగా ఫిప్టీ ప్లస్ స్కోర్లు చేయగా.. పంత్ కూడా సరిగ్గా ఎనిమిది సార్లు యాభైకి పైగా స్కోర్లు సాధించాడు. మరో ఫిప్టీ ప్లస్ స్కోర్ సాధిస్తే ధోనిని ఆధిగమిస్తాడు.
ఇంగ్లండ్‌పై టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్లు వీరే
35 రిషబ్ పంత్
34 వివ్ రిచర్డ్స్
30 టిమ్ సౌతీ
27 యశస్వి జైస్వాల్
26 శుభమన్ గిల్
భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 81 ఓవర్లు ముగిసే సరికి 5 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. భారత్ ఇంకా ఇంగ్లండ్ కంటే 96 పరుగుల వెనకంజలో ఉంది. ప్రస్తుతం క్రీజులో రవీంద్ర జడేజా(31), నితీశ్ కుమార్(13) ఉన్నారు.