
టీమిండియా వైట్ బాల్ జెర్సీలో వైభవ్ సూర్యవంశీ
ఇంగ్లండ్ అండర్-19తో యూత్ టెస్టు సిరీస్‌ను భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ(Vaibhav Suryavanshi) పేలవంగా ఆరంభించాడు. కెంట్ కౌంటీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా తొలి యూత్ టెస్టులో భారత్ అండర్-19, ఇంగ్లండ్ అండర్-19 జట్లు తలపడతున్నాయి.
అయితే వన్డే సిరీస్‌లో దుమ్ములేపిన వైభవ్ సూర్యవంశీ.. ఈ తొలి టెస్టులో మాత్రం నిరాశపరిచాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 13 బంతులు ఎదుర్కొన్న సూర్యవంశీ.. మూడు ఫోర్ల సాయంతో కేవలం 14 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.
ఇంగ్లండ్ పేసర్ అలెక్స్ గ్రీన్ బౌలింగ్‌లో అల్బర్ట్‌కు క్యాచ్ ఇచ్చి తన వికెట్‌ను వైభవ్ కోల్పోయాడు. అయితే ఎన్నో ఆశలు పెట్టుకున్న వైభవ్ నామమాత్రపు స్కోర్‌కే పరిమితం కావడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఎంత పనిచేశావు వైభవ్, నిన్నే నమ్ముకున్నాముగా అంటూ నెటిజన్లు పోస్ట్‌లు పెడుతున్నారు.12 ఓవర్లు ముగిసే సరికి భారత అండర్-19 జట్టు వికెట్ నష్టానికి 40 పరుగులు చేసింది. క్రీజులో విహాన్ మల్హోత్రా(6), ఆయూష్ మాత్రే(18) ఉన్నారు.
వన్డేల్లో విధ్వంసం..
ఈ సిరీస్‌కు ముందు ఆతిథ్య ఇంగ్లండ్‌తో జరిగిన యూత్ వన్డేల్లో వైభవ్ విధ్వంసం సృష్టించాడు.తొలి మ్యాచ్‌లో 19 బంతుల్లోనే 48 పరుగులు సాధించిన ఈ పద్నాలుగేళ్ల కుర్రాడు.. రెండో వన్డేలో 34 బంతుల్లో 45 రన్స్ రాబట్టాడు. ఇక మూడో యూత్ వన్డేల్లో ఈ బిహార్ ఆటగాడు కేవలం 31 బంతుల్లోనే 86 పరుగులతో దుమ్ములేపాడు. అనంతరం నాలుగో వన్డేలో మాత్రం తన విశ్వరూపాన్ని చూపించాడు
52 బంతుల్లోనే వంద పరుగులు పూర్తి చేసుకుని.. యూత్ వన్డేల్లో అత్యంత పిన్న వయసు (14 ఏళ్ల వంద రోజుల వయసు)లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు సాధించాడు. ఐదు వన్డేల్లో ఓవరాల్‌గా 29 సిక్సర్లు బాది 355 పరుగులు సాధించాడు. కాగా ఐపీఎల్‌లో ఈ యువ సంచలనం రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.
తుది జట్లు
ఇంగ్లండ్ U19 (ప్లేయింగ్ XI): జైద్న్ డెన్లీ, ఆర్చీ వాఘన్, హంజా షేక్(కెప్టెన్), రాకీ ఫ్లింటాఫ్, బెన్ మేయెస్, థామస్ రెవ్(వికెట్), ఎకాన్ష్ సింగ్, రాల్ఫీ ఆల్బర్ట్, జాక్ హోమ్, జేమ్స్ మింటో, అలెక్స్ గ్రీన్
ఇండియా U19 (ప్లేయింగ్ XI): ఆయుష్ మ్త్రే(కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, విహాన్ మల్హోత్రా, మౌల్యరాజ్‌సింగ్ చావ్డా, రాహుల్ కుమార్, అభిజ్ఞాన్ కుందు(వికెట్ కీపర్), అంబరీష్, మహ్మద్ ఈనాన్, దీపేష్ దేవేంద్రన్, హెనిల్ పటేల్, అన్మోల్జీత్ సింగ్
చదవండి: #Pat Cummins: సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కీలక నిర్ణయం..