
ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ (Pat Cummins) కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఈ ఏడాది ఆగస్టులో దక్షిణాఫ్రికాతో జరగనున్న టీ20, వన్డే సిరీస్ నుంచి కమ్మిన్స్ తప్పుకొన్నాడు. యాషెస్ సిరీస్, వేసవి బీజీ షెడ్యూల్ దృష్ట్యా అతడికి సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. కమ్మిన్స్ గత కొంత కాలంగా ఆ విరామంగా క్రికెట్ ఆడుతున్నాడు.
ఈ సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్రస్తుతం మూడు మ్యాచ్‌లటెస్టు సిరీస్ కోసం వెస్టిండీస్ పర్యటనలో ఉన్నాడు. శనివారం నుంచి ఈ సిరీస్‌లో ఆఖరి టెస్టు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ ముగిసిన వెంటనే అతడు స్వదేశానికి తిరిగి వెళ్లనున్నాడు. విండీస్‌తో జరగనున్న టీ20, వన్డే సిరీస్‌లకు కూడా అతడు దూరంగా ఉండనున్నాడు.
"రాబోయే రెండు నెలలు ఆటకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. వేసవిలో స్వదేశంలో జరిగే సిరీస్‌లకు సిద్దమైందుకు నాకు దాదాపు 7 వారాల సమయం దొరికింది. అయితే ఈ సమయంలో బౌలింగ్ ప్రాక్టీస్ ఎక్కువగా చేయకపోవచ్చు.
కానీ జిమ్ వర్క్ మాత్రం ఎక్కువగా చేస్తాను. న్యూజిలాండ్, భారత్‌తో జరిగే వైట్ బాల్ సిరీస్‌లలో తిరిగి ఆడే అవకాశముంది. ఆ తర్వాత రెడ్‌బాల్ క్రికెట్ టోర్నీషెఫీల్డ్ షీల్డ్, యాషెస్ సిరీస్‌లతో బీజీబీజీగా గడపనున్నాను" అని విండీస్‌తో మూడు టెస్టుకు ముందు విలేకరుల సమావేశంలో కమ్మిన్స్ పేర్కొన్నాడు.
కాగా దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు మూడు మ్యాచ్‌ల టీ20, వన్డే సిరీస్‌లో తలపడేందుకు ఆస్ట్రేలియాకు రానుంది. ఆగస్టు 10న డార్విన్ వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ వైట్‌బాల్ సిరీస్ ప్రారంభం కానుంది.
దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా వైట్ బాల్ సిరీస్ షెడ్యూల్
తొలి టీ20- ఆగస్టు 10, ఆదివారం-డార్విన్
రెండో టీ20-ఆగస్టు 12, మంగళవారం-కైర్న్స్
మూడో టీ20-ఆగస్టు 16,శనివారం-కైర్న్స్
తొలి వన్డే-ఆగస్టు 19, మంగళవారం-కైర్న్స్
రెండో వన్డే-ఆగస్టు 22, శుక్రవారం-మక్కే
మూడో వన్డే-ఆగస్టు 24, ఆదివారం-మక్కే
చదవండి: కేఎల్ రాహుల్, గిల్ తప్పుల వల్లే ఇలా జరిగింది: ఇర్ఫాన్ పఠాన్ ఆగ్రహం